గద్వాల రూరల్, జనవరి 29 : బీఆర్ఎస్ పార్టీకి కా ర్యకర్తలే బలం, బలగం అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం దే శంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాయలంలో సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం, బీఆర్ఎస్ సర్పంచు ల సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ గాంధీజీ క లలుగన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి కా ర్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మధ్యవర్తి లేకుండా అందడంతో ప్రజలతో సమన్వయం కొరవడి ఇబ్బంది కలిగిందన్నారు. అలాంటివి భవిష్యత్‌లో జరుగకుండా దృష్టి సారిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిందని.. వాటిని అమలు చేయకుంటే ప్రజలపక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామంలో సర్పంచుగా మీరు చేసిన అభివృద్ధి పనులు గుర్తుండిపోతాయన్నారు. అ నంతరం సర్పంచులను శాలువా, మెమెంటోతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కే శవ్, ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్, విజయకుమార్, రాజారెడ్డి, మనోరమ, జెడ్పీటీసీలు పద్మ, రాజశేఖర్, ప్రభాకర్‌రెడ్డి, శ్యామల, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మన్ బాబర్, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చెన్నయ్య, నాయకులు రమేశ్‌నాయుడు, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రామన్‌గౌడ్, సలాం, మధుసూదన్‌రెడ్డి, తిమ్మారెడ్డి ఉన్నారు.