భూత్పూర్, ఫిబ్రవరి 29 : మండలంలోని కరివెనలో తల్లిని కూతురు కట్టెతో కొట్టడంతో మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకున్నది. ఇందుకు సం బంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరివెనకు చెంది న కాకి వెంకటమ్మ(60) కూతురు నారమ్మను భర్త వదిలేయడంతో తల్లి వద్దే ఉంటున్నది. తాగుడుకు బానిసై వెంకటమ్మను రోజూ డబ్బులు కావాలని వేధిస్తుండేది. గురువారం డబ్బులు లేవని తల్లి తెగేసి చెప్పడంతో నారమ్మ కట్టెతో తలపై బలంగా కొట్టింది.
తీవ్ర గాయాలైన వెంకటమ్మను స్థానికులు జిల్లా దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందిం ది. ఇందుకు సంబంధించి మృతురాలి కుమారుడు నర్సింహ ఫిర్యాదు మేరకు సీఐ రామకృష్ణ, ఎస్సై శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.