కల్వకుర్తి, మే 21 : ఎంజీకేఎల్ఐ పథకం కింద 2017 నుంచి సాగునీరు పుష్కలంగా అందుతుండగా కల్వకుర్తి ప్రాంతంలో రైతులు ఎక్కువ మొత్తంలో వరి సాగుచేశారు. 2020 నుంచి వరి సాగు ఊహించనంత గా పెరిగింది. దీంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి నే రుగా సేకరించింది. మద్దతు ధర కూడా మంచిగా వ స్తుండడంతో రైతులెవరూ ప్రైవేట్ వ్యాపారస్తులను ఆశ్రయించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు (సీఎంఆర్) అర్హులైన రైస్‌మిల్లు యజమానులకు ఎంపిక చేసి వారికి అ ప్పగించింది. మార్కెట్లోకి ధాన్యం ఎక్కువగా రావడంతో వ్యాపారులు ఎక్కడ వీలైతే అక్కడ జిన్నింగ్ మిల్లులు, ఫంక్షన్హాల్లు, గోదాంలలో నిల్వ ఉంచారు. అయితే, ఏటా ధాన్యం దిగుబడి అధికంగా రావడంతో దూరంగా ఉన్న గోదాంలలో నిల్వ ఉంచిన వడ్ల బస్తాలు అలాగే మిగులుతున్నాయి. కోటా ప్రకారం బియ్యాన్ని ప్రభుత్వానికి ఇస్తూ వస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను బియ్యంగా మార్చి ఇవ్వాలని (సీఎంఆర్) 2022 యాసంగి సీజన్లో కల్వకుర్తి పట్టణానికి చెందిన వ్యాపారి రమేశ్‌బాబుకు కేటాయించింది. పారాబాయి ల్డ్ మిల్లు ఉన్న రమేశ్‌బాబుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున వడ్లను అప్పజెప్పిన నేపథ్యంలో వెల్దండ మండలం పె ద్దాపూర్ గ్రామ సమీపంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదాంను అద్దెకు తీసుకుని ధాన్యాపు బస్తాలను నిల్వ చేశాడు. నిల్వలు ఎక్కువగా ఉండడం, కొత్తగా వడ్లు వస్తుండడంతో సదరు వ్యా పారి పెద్దాపూర్ గోదాం వైపు దృష్టి సారించలేదు. గో దాంలో నిల్వ ఉంచిన 2022 యాసంగి వడ్లను 2023 యాసంగి వడ్ల నిల్వగా అధికారులకు రికార్డు ఇచ్చాడు. తన వద్ద ఉన్న నిల్వలు తగ్గగానే.. వడ్లను బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వాలని భావించాడు. అయితే, పెద్దాపూర్ గోదాం నుంచి ధాన్యం బస్తాలను తీసుకెళ్లేందుకు వ్యాపారికి అద్దె చెల్లింపు అడ్డంకిగా మారింది. మా ర్కెటింగ్ శాఖ నిర్మించిన గోదాంలో నిల్వ ఉంచిన ధా న్యానికి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని.. అప్పటి ప్ర భుత్వం మౌఖికంగా ప్రకటన చేసింది. దీంతో వ్యాపారి కిరాయి ఇవ్వలేదు. మార్కెట్ అధికారులు మాత్రం అద్దె చెల్లించాలని వ్యాపారికి నోటీసులు జారీ చేశారు. అద్దె అవసరం లేదని తెలిపిన జీవో కాపీ ఇవ్వాలి.. లేదా అద్దె చెల్లించాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు డిమాండ్ చేస్తూ గోదాంకు తాళం బిగించారు. ఈ ఏడా ది మార్చి మొదటి వారంలో వనపర్తి, అచ్చంపేట, కొ ల్లాపూర్‌లో వడ్ల బస్తాలు చోరీ అయ్యాయని వార్తలు రా వడంతో సదరు వ్యాపారి మార్కెటింగ్ శాఖ అధికారులకు సమాచారమిచ్చాడు. రెండు, మూడు రోజుల త ర్వాత తానే నేరుగా గోదాం వద్దకు వెళ్లగా..
తాళాలు తీసి ఉన్నట్లు గమనించి వెంటనే వెల్దండ పోలీసులకు విషయాన్ని వివరించాడు. సుమారు 13 వేల బస్తాలు చోరీ అయ్యాయని సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని వేగంగా దర్యాప్తు చేపట్టారు. దుండగులను గుర్తించి అదుపులోకి తీసుకున్నా రు. చోరీ చేసిన బస్తాలను నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోకి ఓ బడా వ్యాపారికి విక్రయించినట్లు ఒప్పుకొన్నా రు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. 3 వేల బస్తాలు మాత్ర మే కొనుగోలు చేశామని బడా వ్యాపారి అంగీకరించిన ట్లు సమాచారం. పోలీసులు మాత్రం 2,400 బస్తాలు చోరీ అయ్యాయని కేసు నమోదు చేశారు. మరి మిగతా పది వేల బస్తాలు ఎక్కడికి వెళ్లాయన్నదే శేషప్రశ్నగా మి గిలింది. పెద్దాపూర్ గోదాంలో వడ్ల సంచులు నిల్వ వేసినప్పటి నుంచి అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదని, మార్కెటిం గ్ శాఖ అధికారులే గోదాంకు తాళం వేశారని రమేశ్‌బాబు తెలిపారు. ఇందులో ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశాడు. గోదాంకు తాళాలు బిగించి ఉండటం, అటు వైపు ఎవ్వరూ రాకపోవడం, డిసెంబర్, జనవరి మాసాల్లో చలి ఎక్కువగా ఉండడాన్ని దుండగులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని పెద్దాపూర్ గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గోదాం పక్కవైపు ఉన్న షెట్లర్ల నుంచి వడ్ల బస్తాలు తీస్తే ఎవ్వరి కీ డౌట్ రాదనే ఉద్దేశంతో దుండగులు వడ్ల బస్తాలు ఎ త్తుకెళ్లి ఉండొచ్చు. చోరీ ఘటనలో పెద్ద తలకాయాలు ఉండొచ్చనే అనుమానాలను రైస్ మిల్లర్లు వ్యక్తం చేస్తున్నారు. వడ్లు నిల్వ ఉంచిన సంచుల మీద సివిల్ సైప్లె పేరు, గుర్తు ఉంటుందని.. అటువంటి బస్తాలను కొనుగోలు చేయడం చూస్తే ప్రణాళికా ప్రకారం చోరీ చేశారని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి 10 వేల బస్తాల వడ్లను రికవరీ చేయాలని, నిందితులను కఠినం గా శిక్షించాలని కోరుతున్నారు. బాధితుడు మాత్రం న్యా యం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.