కోస్గి /మక్తల్, అక్టోబర్ 4 : పేట జిల్లాలోని కోస్గి, మక్తల్ పట్టణాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి సభ విజయవంతమైంది. ఆయా పట్టణాల్లో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్యర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన నియోజకవర్గ ప్రగతి సభలకు ఆయా నియోజకవర్గాల్లోని పల్లె వల్లె నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ , డప్పు, డోలు మేళాలతో, మహిళలు బతకమ్మలతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
ఉదయం 11:10కి హెలికాప్టర్ ద్వారా కొస్గి పట్టణానికి చేరుకున్న మంత్రులు హరీశ్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మైన్ బండ ప్రకాశ్‌కు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి భారీ ర్యాలీగా తరలి వచ్చారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానకు చేరుకొని అక్కడ 50 పడకల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శివాజీ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన ప్రగతి నివేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం అక్కడి నుంచి మక్తల్‌కు వెళ్లారు.
మధ్యాహ్నం 1:5 గంటలకు మంత్రి హరీశ్‌రావు హెలీకాప్టర్ ద్వారా మక్తల్ పట్ట ణానికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎస్ ఆర్ రెడ్డి, రైతు సమ న్వయ సమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరితరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, దఎంపీపీ వనజ, రాష్ట్ర గిడ్డ ంగు ల చైర్ పర్సన్ రజిని, మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్ తదితరులు మంత్రి హరీశ్ రావుకు పూల బోకేలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనం తరం పట్టణ శివారులో భీమా ఎత్తిపోతల పథకం ప ంపు హౌస్ స్టేజీ-2 వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహ న్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసం గించారు. మంత్రి హరీశ్‌రావు స్పీచ్ పార్టీ శేణులు , కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది. ఆయన మాట్లాడే టంత సేపు అ భిమానులు , కార్యకర్తలు ఉత్సాహంగా , కేరింతలు కొట్టుతు ఈలలు వేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా,అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు.
గులాబీ మయమైన కోస్గి
కోస్గి రూరల్, అక్టోబర్ 4 : కోస్గి పట్టణంలో బుధవారం మంత్రి హరీశ్‌రావు పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ నుంచి సభాస్థలి వరకు దారి పోడువునా స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ప్లెక్సీలతో గులాబీ మయమైంది.
మక్తల్ జనసంద్రం..
మక్తల్ టౌన్,అక్టోబర్4: మక్తల్ ప్రగతిసభకు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో మక్తల్ పట్టణం జనసంద్రంగా మారింది. మంత్రి సభకు నియోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, ఊట్కూర్, కృష్ణ, ఆత్మకూర్, అమరచింత, నర్వ మండలాల నుండి డప్పు వాయిద్యాలతో గులాభి శ్రేణులు సభాస్థలికి భారీసంఖ్యలో తరలిరావడంతో, సభాప్రాంగనమంతా జనంతో కిక్కిరిసి పోయింది.
మక్తల్ ప్రగతి సభ సైడ్‌లైట్స్
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని రేవంత్‌రెడ్డి చెప్పినట్లు రైతులకు 3 గంటల కరెంటు కావాలా…లేక ఇప్పుడిస్తున్న 24 గంటల కరెంటు కావాలా చేతులు ఎత్తండని మంత్రి పేర్కొనడంతో సభలో ఉన్న వారందరూ 24 గంటల కరెంటు కావాలంటూ చేతులు పైకెత్తారు. 3 గంటల కరెంటుకు చేతులు ఎత్తకపోవడంతో 24 గంటల కరెంటుకు చేతులు ఎత్తిన వారందరూ కారు గుర్తుకు, మా రామన్నకు ఓటేయండని, 3 గంటల వారు కాంగ్రెస్‌కు ఓటేయండని హరీష్‌రావు అనడంతో ప్రజలు ఉత్సాహంగా కరతాళధ్వనులు చేశారు.
– ఊట్కూర్, అక్టోబర్ 4