ఊటూర్, డిసెంబర్ 31 : నారాయణపేట జిల్లా ఊటూర్ మండల కేంద్రంలోని మొటార్ వీధిలో అంగన్వాడీ టీచర్ వెంకటేశ్వరమ్మ పెరట్లో బ్రహ్మకమలం వికసించింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పువ్వు పూస్తుంది. ప్రత్యేకించి కార్తీకమాసంలో బ్రహ్మకమలం వికసిస్తుంది. పూచిన రెండు మూడు గంటల్లోనే ఈ పువ్వు వాడిపోతుంది. చాలా అరుదుగా కనిపించే మొకను రెండేండ్ల కిందట నర్వ మండలం నాగిరెడ్డిపల్లి ఆర్ఐ రాఘవేంద్రరెడ్డి ఇంటి నుం చి తెచ్చినట్లు వెంకటేశ్వరమ్మ తెలిపారు.