ఊట్కూర్, డిసెంబర్ 13 : బోధనలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక చొ రవ చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మండలంలోని తిప్రాస్‌పల్లి, మల్లేపల్లి, చిన్నపొర్ల, పెద్దపొర్ల, ఎడవెల్లి, బిజ్వారం తదితర గ్రామాల్లో కలెక్టర్ మంగళవారం పర్యటించి ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ల్లో తొలిమెట్టు కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించా రు. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను తరగతి గదిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. కలెక్టర్ తన చేతి గడియారాన్ని విద్యార్థులకు చూయించి సమ యం ఎంతైందో చెప్పాలని అడిగారు.
కలెక్టర్ అడిగిన పలు ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పిన విద్యార్థులను ప్రశంసించారు. సరైన పాఠ్య ప్రణాళికల, బోధనాభ్యాసన సామగ్రితో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన ఉండాలని ఉపా ధ్యాయులకు సూచించారు. పలు పాఠశాలల్లో రికార్డులను పరిశీలించి విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండడంపై హెచ్‌ఎంలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు-మన బ డి కార్యక్రమంలో భాగంగా నిధులు మంజూరైన పాఠశాల ల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడంపై కాంట్రాక్టర్లను ప్రశ్నించారు. పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయించని పక్షంలో ఇతరులకు అప్పజేపుతామని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్కుమార్గౌ డ్, సర్పంచులు సుమంగళ, మాణిక్యమ్మ, ఎంపీడీవో కా ళప్ప, ఎంఈవో వెంకటయ్య, డీఈ రాములు, ఏఈ రఫీ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
మల్లేపల్లి గ్రామ కార్యదర్శి ఆనందరావుపై కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం సస్పెన్షన్ వేటు వేశా రు. మండలంలోని పలు గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఆయన మల్లేపల్లిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఇదేక్రమంలో గ్రామంలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం, గ్రామ పం చాయతీ నిధులకు సంబంధించిన రికార్డు లు సక్రమంగా లేకపోవడంపై కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో వి ధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని అక్కడే ఉ న్న ఎంపీవో వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించా రు. కాగా, వారం రోజుల కిందట గ్రామాన్ని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ సందర్శించి కార్యదర్శి పనితీరును ప్రశ్నించి హెచ్చరికలు చేశారు. తాజాగా కలెక్టర్ పరిశీలనలో కార్యదర్శి పనితీరు మార్చుకోవపోవడంతో శ్రీ హర్ష ఆదేశాలమేరకు సస్పెన్షన్ వేటు వేశామని ఎంపీడీవో కాళప్ప స్థానిక విలేకరులకు వెల్లడించారు.
పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలి
నారాయణపేట టౌన్, డిసెంబర్ 13 : అంగన్వాడీ కేం ద్రాల్లో సామ్, మ్యాం పిల్లలను గుర్తించి వారి ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సీడీపీవోలు, సూపర్వైజర్లతో మం గళవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీడీపీవోలు, సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను ప్రతిరోజూ తనిఖీ చేయాలన్నారు. కేంద్రాల్లో టీచర్లు సమయపాలన పాటిస్తున్నారా లేదా పర్యవేక్షించాలన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సంబంధించిన వివరాలను కార్డు ల్లో నమోదు చేశారా లేదా పరిశీలించాలన్నారు. అరుణ్య నుంచి అందజేస్తున్న చెక్కీలను ప్రతి విద్యార్థికి అందేలా చూడాలన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
పట్టణంలో చేపడుతున్న అ భివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించి మాట్లాడా రు. అంబేద్కర్ చౌరస్తా నుంచి వీరసావర్కర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసి వాకింగ్ ట్రాక్, లై టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. మురుగు కాల్వల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, సత్యసాయి కాలనీలోని వృద్ధుల పార్కును వినియోగంలోకి తీసుకురావాలన్నారు. బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, ఇంజినీర్ విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో రాణించాలి
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించా రు. రంగారెడ్డి జిల్లా మణికొండలో నిర్వహించిన రాష్ట్ర స్థా యి రెజ్లింగ్‌లో పోటీల్లో ధన్వాడలోని కేజీబీవీలో చదువుతున్న విద్యార్థులు బాలమణి, గీత, నాగలక్ష్మి పాల్గొని ఒక సిల్వర్, రెండు మెడల్స్ కైవసం చేసుకున్నారు. మంగళవా రం పట్టణంలోని కలెక్టర్ చాంబర్లో శ్రీహర్ష విద్యార్థులను అభినందించి మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఈ వో గోవిందరాజులు, జీసీడీవో పద్మనళిని, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలి
జిల్లాలో మిగిలిపోయిన క్రీడాప్రాంగణాల కోసం స్థలాలను పరిశీలించి త్వరగా పనులను పూర్తి చేయాలని అదన పు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలతో మంగళవారం సమావే శం నిర్వహించి మాట్లాడారు. క్రీడాప్రాంగణాల పనులు త్వ రగా పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అం దు లో 10వేల మొక్కలు ఉండేలా చూడాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, నెలకు ఒకసారి గ్రామసభలు ఏర్పాటు చేసుకొని మౌలిక సదుపాయా ల ఏర్పాటుపై తీర్మానం చేసుకోవాలన్నారు.