సాగర్ నీటి కోసం రైతుల ధర్నా.. తెలంగాణ సరిహద్దు రహదారిపై బైఠాయింపు
అదునుకు నాగార్జునసాగర్ నీరు అందకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయంటూ తెలంగాణ, ఏపీ రైతులు ఆందోళనకు దిగారు. దాములూరు మేజర్ పరిధి ఆంధ్రా ప్రాంత రైతులతోపాటు తెలంగాణలోని బోనకల్లు మండలం దేశినేనిపాలెం, అల్లీనాగారం, మడుపల్లి గ్రామాల రైతులు ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు రహదారిపై మంగళవారం బైఠాయించారు.
- ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతుల డిమాండ్
బోనకల్లు, ఫిబ్రవరి 10 : అదునుకు నాగార్జునసాగర్ నీరు అందకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయంటూ తెలంగాణ, ఏపీ రైతులు ఆందోళనకు దిగారు. దాములూరు మేజర్ పరిధి ఆంధ్రా ప్రాంత రైతులతోపాటు తెలంగాణలోని బోనకల్లు మండలం దేశినేనిపాలెం, అల్లీనాగారం, మడుపల్లి గ్రామాల రైతులు ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు రహదారిపై మంగళవారం బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. సాగర్ నీటిని ఎడమ కాలువ ద్వారా నిలిపివేయడంతో బీబీసీ (బోనకల్ బ్రాంచ్ కెనాల్) పరిధి ఏపీలోని దాములూరు, మధిర మేజర్ కాలువల పరిధిలోని ఆయకట్టు భూములకు నీరందడం లేదని వాపోయారు.
ప్రస్తుతానికి బీబీసీ కెనాల్‌కు 1,370 క్యూసెకుల నీరు సరఫరా కావాల్సి ఉండగా.. 1,100 క్యూసెకుల నీరు మాత్రమే వస్తున్నదని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు, నీటిపారుదల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరగా సాగర్ నీరు విడుదల చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

