నారాయణపేట, సెప్టెంబర్ 23: మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శక్తిపీఠంలో భక్తి శ్రద్ధలతో జ్ఞాన యజ్ఞం, విజయ హోమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తిరుమలాచార్యులు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. పాండురంగస్వామి దేవాలయంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహా నికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు.
నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 23: పేట మండలం లోని కొల్లంపల్లి, చిన్నజట్రం, బొమ్మన్‌పాడ్, పిల్లిగుండ్ల తండాలో ఏర్పాటు చేసిన గణనాథులను బ్యాండు మేళతాళాల మధ్య ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేశారు.
ఊట్కూర్, సెప్టెంబర్ 23 : మండలంలోని బిజ్వారం, పెద్దపొర్ల, చిన్నపొర్ల, తిప్రాస్‌పల్లి, ఎడవెల్లి, ఓబ్లాపూర్, కొల్లూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అందంగా అలంకరించిన వాహనాల్లో పుర వీధుల గుండా శోభా యాత్ర నిర్వహించి చెరువుల్లో నిమజ్జనం చేశారు.
మరికల్, సెప్టెంబర్ 23: మండల కేంద్రంలోని మణికంఠ జునియర్ కళాశాల, సరస్వతీ డిగ్రీ కళాశాలల్లో ఏర్పా టు చేసిన వినాయకులను శనివారం నిమజ్జనానికి తరలిం చారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ గణనాథులను శోభాయాత్రగా చెరువుకు తరలించి నిమజ్జనం చేశారు. అలాగే కుర్వ గేరి, తెలంగాణ చౌరస్తా , పటేల్ రోడ్డు, హన్మాన్‌వాడ, గెండేగేరిలోని వినాయక మండ పాల వద్ద భక్తులకు అన్నదానం చేశారు.
మక్తల్ అర్బన్, సెప్టెంబర్ 23: మక్తల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన మండపాలవద్ద గణపతులకు నిర్వాహకులు పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 8వ వార్డు న్యూశబరీ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుడికి సీఐ రాంలాల్, ఎస్సై పర్వతాలు పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఆటలపోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వవిజేతలకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్ బహుమతులు అందజేశారు. అనంతరం లడ్డూ వేలం నిర్వహించగా కాలనీకి చెందిన రాంరెడ్డి రూ.16,500కు దక్కించుకున్నారు. నిర్వాహకులు విగ్రహ దాత తాయప్పను సత్కరించారు. అనంతరం గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో నిర్వాహకులు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అంబాదాస్, ఉమాకాంత్, చిన్న వెంకటేశ్, రమేశ్, పల్లవి, భార్గవి, పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ, సెప్టెంబర్ 23 : మండలంలోని టైరోడ్ వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద యూత్ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచమ సిద్ధిలింగ మహాస్వాములు, ఎసై విజయ్‌భాస్కర్ హాజరయ్యారు. అనంతరం నిర్వాహకులు ఎస్సై విజయ్‌భాస్కర్‌ను సన్మానించి జన్మదిన సందర్బంగా కమిటీ సభ్యులు సన్మానించి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆంజనేయులు, చంద్రు, జగదీశ్, బుడ్డప్ప, బస్వరాజ్, తిప్పయ్య, తాత, శివరాజ్, సుభాష్, వీరేశ్, భక్తులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.