మహబూబ్‌నగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్ల విషయం ఇంకా తేల్చనప్పటికీ ఎన్నికల సంఘం మాత్రం ముందస్తు కార్యాచరణను పూర్తి చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 13వతేదీన ఓటరు ముసాయిదా జాబితాను అందుబాటులో ఉంచిన అధికారులు ఈనెల 21వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నా రు. జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉంటే పం చాయతీ కార్యదర్శులకు తెలియజేయాలని సూ చిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నాటికి అభ్యంతరాలను పరిష్కరిస్తారు. గ్రామాల్లోని ఒకే కు టుంబానికి చెందిన ఓటర్లందరినీ ఒకే వార్డులో చేర్చడం, జాబితాలో తప్పులను సరిచేసి షెడ్యూల్ ప్రకారం ఈనెల 28వ తేదీన తుది జాబితాను విడుదల చేయనున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 మండలాల్లోని 441 పంచాయతీల్లో 5,16,062 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. పంచాయతీలో పు రుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉ న్నారు. పురుష ఓటర్లు 2,57,477 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 2,58,578మంది, ఇతర ఓటర్లు ఏడుగురు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 1,101మంది ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం పూ ర్తి కావడంతో ఆయా పంచాయతీల్లో ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. పంచాయతీల్లో నిధుల లేమి అంశం ప్రత్యేకాధికారులకు తలనొప్పిగా మారడంతో అధికారులు అటువైపు చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం సమావేశాలకే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని అడ్డాకుల మండలంలో 24,148, బాలానగర్‌లో 32,910, భూత్పూరులో 26, 357, చిన్నచింతకుంటలో 37,474, దేవరకద్రలో 45,956, గండీడ్‌లో 61,577, హన్వాడలో 39,332, జడ్చర్లలో 40,237, కోయిలకొండలో 50,840, మహబూబ్‌నగర్ రూరల్‌లో 36,847, మిడ్జిల్‌లో 24,770, మూసాపేటలో 21,305, నవాబ్‌పేటలో 52,708, రాజాపూర్‌లో 21,601 ఓటర్లు ఉన్నారు.
ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది. మాకంటే మాకు వస్తుందంటూ ఆశావహులు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు ఒకే రిజర్వేషన్లు ఉండేలా చట్టం తీసుకొచ్చింది. దీంతో 2019లో జరిగిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా..? లేదా కొత్త పద్ధతిలో నిర్వహిస్తారా.? అనేది తేలాల్సి ఉంది.