మహబూబ్‌నగర్ నెట్వర్క్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ ది నోత్సవ వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యా ప్తంగా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద జాతీయ జెం డాను ఎగురవేశారు. విద్యుద్దీపాల కాంతుల్లో అందంగా ముస్తాబు చేసిన పోలీస్ పరేడ్, ఐడీవోసీ, ఎస్పీ కార్యాలయాల వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు ము వ్వన్నెల జెండా ఆవిష్కరించారు.
పా లమూరు, నారాయణపేటలో మం త్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్‌లో రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చి న్నారెడ్డి, వనపర్తిలో చీప్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, జోగుళాంబ గద్వాలలో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. అమరుల స్తూపాల వద్ద నివాళులర్పించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఉద్యమకారులను సన్మానించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాం స్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాగా ఊట్కూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద హౌసింగ్ పీడీ, మండల ప్రత్యేకాధికారి శంకర్‌నాయక్ జాతీయ జెండా ను ఎగురవేస్తుండగా పతాకం పూర్తిగా ఎగురకుండా మధ్యలోనే నిలిచిపోయింది.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. పాలమూరు, వనపర్తి, జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గద్వాలలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, భూత్పూరు, మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు గులాబీ జెండాను ఎగురవేశారు. తెలంగాణ తల్లితోపాటు అమరవీరులకు, అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తామంతా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.