నాగర్‌కర్నూల్, జూలై 6 (నమస్తే తెలంగాణ) ;మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు తెరపడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో స్పెషలాఫీసర్లు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనను ప్రత్యేకాధికారులమయం చేస్తున్నది. జీపీ, మండల, జిల్లా పరిషత్‌లలో ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసినా పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నది. అధికారులు అందుబాటులో లేకపోవడంతో పల్లెల్లో సమస్యలు తిష్టవేశాయి. కాగా, ఇప్పట్లో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు.
మండల, జిల్లా పరిషత్‌లో ఇ కపై పంచాయతీల్లో మాదిరి ప్ర త్యేకాధికారులు పాలన రానున్న ది. ఐదేండ్ల కిందట పదవీ ప్ర మాణం చేసిన ఎంపీటీసీలు, జె డ్పీటీసీలు మాజీలయ్యారు. ఈ కారణంగా జిల్లాస్థాయి అధికారు లు పరిషత్‌లకు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మండలాల వారీగా ప్రత్యేకాధికారుల నియామకం పూర్తి కా గా, గ్రామాల్లో పంచాయతీ సర్పంచుల స్థానంలో మాదిరిగా పరిషత్‌లనూ ప్రత్యేకాధికారులు పాలించనున్నారు. ఫలితంగా ప్రజాపాలనలో అధికారుల అజమాయిషీనే కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు ప్రజాపాలన అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అందుకు భిన్నంగా పరిపాలన సా గిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజాపాలనగా భా వించే గ్రామ పంచాయతీల పాలకవర్గాల గ డువు ముగిసిపోయి నెలలు గడుస్తున్నా ఎ న్నికల నిర్వహణ చేపట్టడం లేదు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పేరుతో ముందుకు సాగడం లేదు. దీంతో గ్రామా ల్లో పాలన అటకెక్కింది.
తాగునీరు, వీధి బ ల్బులు, మురు గు కాల్వల పరిశుభ్రతవంటి చిన్న, చిన్న సమస్యలకూ జవాబుదారీతనం లోపించింది. సర్పంచులు ఉంటే నేరుగా ప్రజలు పనులను అడిగి చే యించుకోగలిగేవారు. ఇప్పుడా పరిస్థితి లే దు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసినా ప్రభుత్వం అదే తీరును పాటిస్తోంది. జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా నియామకమయ్యారు. ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులు తమ శాఖలతోపాటు ఇతర జిల్లాలకూ ఇన్చార్జి అధికారులుగా వ్యవహరిస్తున్నారు. అదనపు బా ధ్యతలు మరింత భారంగా మారనున్నాయి. దీనికితోడు పంచాయతీలు, పరిషత్‌లో నిధుల సమస్య వేధిస్తోంది. ముఖ్యమైన పనులు చేసినా వెంటనే బిల్లులు వచ్చే పరిస్థితి లేదు. స్థానిక ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేలు, మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్సీలను అడిగి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నిధులు తెప్పించుకోగలిగే అవకాశం ఉండేది. ఎన్నికలు జరగకపోవడంతో స్థానిక సంస్థలు బలహీనంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర జాపాలన అంటూ గొప్పగా ప్రకటనలు చే స్తోందే తప్పా ప్రజాపాలనకు మూలస్తంభాలైన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక గ్రామ పంచాయతీల మాదిరి మండల, జిల్లా పరిషత్‌లూ బోసిపోనున్నాయి.
త్వరగా నిర్వహించాలి..
జిల్లా పరిషత్‌లకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రజాప్రతినిధులు ఉంటేనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో కలిసి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పంచాయతీల మాదిరిగా ఎన్నికలు ఆలస్యమైతే అభివృద్ధి ఆగిపోతుంది. జెడ్పీటీసీలకు మండలాల్లో ప్రత్యేక చాంబర్లు కేటాయించి, గౌరవ వేతనాలు పెంచాలి.
– ప్రవీణ్, మాజీ జెడ్పీటీసీ, పదర
చాలా అభివృద్ధి చేశాం..
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ సారథ్యంలో ఐదేళ్లు అభివృద్ధిలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. 60 ఏండ్లు వెనుకబడిన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఎన్నికలు త్వరగా నిర్వహించాలి.
– శ్రీశైలం, మాజీ జెడ్పీటీసీ, నాగర్‌కర్నూల్