నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 2 : పదో తరగతి పరీక్షలు బుధవారం ముగిశాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద కేరింతలు కొడుతూ బయటకు వచ్చారు. మార్చి 21 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 45,574 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 235 పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లు చేశారు.
బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో 60 పరీక్షా కేంద్రాల్లో జరిగిన సాంఘికశాస్త్రం పేపర్‌కు 37 మంది మాత్రమే గైర్హాజరు అయ్యారు. మొత్తం 12,776 మంది విద్యార్థులకు గా నూ 12739 మంది పరీక్ష రాయగా 99.71శాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలో 39 పరీక్షా కేం ద్రాల్లో 7,635 మంది విద్యార్థులకు గానూ 7,617 ప రీక్ష రాయగా 18 మంది గైర్హాజరయ్యారు.
నా గర్‌కర్నూల్ జిల్ల్లాలో 60 పరీక్షా కేంద్రాలు 10555 వి ద్యార్థులకు గానూ 10529 మంది పరీక్షలు రాయగా 26 మంది గైర్హాజరయ్యారు. వనపర్తి జిల్లాలో 36 పరీ క్షా కేంద్రాల్లో 6853 మంది విద్యార్థులకు గానూ 68 40 మంది పరీక్షలు రాయగా 13 మంది గైర్హాజ రయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 40 పరీక్షా కేంద్రాల్లో 7600 మంది విద్యార్థులకు 7567 మంది పరీక్ష రాయగా 33 మంది గైర్హాజరయ్యారు.