నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 16 : తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి గులాబీ దళపతి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, రైతుబంధు, హరిత స్వాప్నికుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌లోని తన స్వగృహంలో గు లాబీ మొక్కలు నాటి వృక్షార్చన చేశారు.
సోమవారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎంపీ గ్రీన్ ఇం డియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే మర్రి మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ రైతాంగం, ప్రజల తరఫున కేసీఆర్‌కు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 16 : మండలంలోని కడుకుంట్ల గ్రామంలో తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులోని పచ్చని పంట పొ లాల మధ్య రైతులతో కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ పదేండ్ల పాలనలో కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, మహిళలు చాలా సంతోషంగా గడిపారన్నారు. 15 నె లల కాంగ్రెస్ పాలనలో ముఖ్యంగా రైతులు గోస పడుతున్నారని, సాగునీరు సకాలంలో అందక, దిగుబడి తగ్గి మద్దతు ధర రాక బోనస్ లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
కాం గ్రెస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తి ట్టడం పనిగా పెట్టుకొని సంక్షేమం అభివృద్ధిని గాలికి వ దిలేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు రైతులన్నా, ప చ్చ ని పొలాలన్నా ఇష్టమని అందుకే ఆయన జన్మదిన వే డుకలను పంట పొలాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు వాకిటి శ్రీ ధర్, రమేశ్‌గౌడ్, నాయకులు మాణిక్యం, హరితాబాలకృష్ణ, సువర్ణాశ్రీను, గంధం పరంజ్యోతి, మాధవ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, నరసింహ, శివన్నసాగర్, సుధాకర్‌చారి, రాము, జోహెబ్ హుస్సేన్, అరిఫ్, ఇమ్రాన్, ముని, శివ, లక్ష్మణ్, రామచంద్రయాదవ్, వెంకటసాగర్ తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు, ఫిబ్రవరి 16 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను పెబ్బేరులో ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మత్స్య కళాశాల వద్దనున్న పంట పొలాల్లో వ్యవసాయ కూలీలు, రైతుల మధ్య ఆయన చిత్రపటాలు ఉంచి వేడుకలు జరిపారు. కార్యక్రమంటో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చై ర్మన్ కర్రెస్వామి, నాయకులు ఎల్లారెడ్డి, ఎల్లయ్య, శాం తయ్య, సాయిరెడ్డి, బాలస్వామి పాల్గొన్నారు.
మల్దకల్, ఫిబ్రవరి 16 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం మండలకేంద్రంలోని కేజీబీవీలో బీఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు కుర్వ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ ఇచ్చిన గ్రీ న్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా అందరూ మొక్కలు నాటి కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పాలన్నారు.
కార్యక్రమంలో గద్వాల్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇ న్చార్జి భీమన్న, బీఆర్ఎస్ నాయకులు మల్దకల్, సుధాకర్, రాంకుమార్, మల్దకల్, రాము, నర్సింహులు, తిమ్మప్ప, నీలిపల్లి నర్సింహ్మ, రమేశ్, రవితోపాటు తదితరులు పాల్గొన్నారు.