గద్వాల టౌన్, ఫిబ్రవరి 23 : జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షలు ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థినికి హాల్ టికెట్ ఉన్నా పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించిన ఘటన చోటు చేసుకున్నది.. బాధితుల కథనం ప్రకారం మానవపాడు మండలానికి చెందిన విద్యార్థిని భార్గవి తన హాల్‌టికెట్‌తో ఆదివారం ఉదయం 10గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకున్నది. కాగా విద్యార్థిని పేరు తమకు వచ్చిన జాబితాలో లేదని పరీక్షా రాసేందుకు అధికారులు అనమతి ఇవ్వలేదు.
దీంతో గేట్ బయటే విద్యార్థిని ఉండిపోయింది. అధికారుల ను బతిమాలాడిన తమ చేతుల్లో ఏమిలేదని అధికారులు చెప్పడం తో నిరాశతో వెనుతిరిగింది. కాగా విద్యార్థినికి సంబంధించిన ఆ దాయ ధ్రువీకరణ పత్రంలో ఆదాయం రూ. 12.50లక్షల ఉంది. ఈ మేరకు విద్యార్థిని పేరు అనర్హుల జాబితాలో వచ్చిందని అందుకే పరీక్షకు అనుమతి ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆదాయం చూపించిన వారికి హాల్ టికెట్ ఎలా జారీ చేశారని విద్యార్థిని తండ్రి వెంకటేశ్ అధికారులు ప్రశ్నించారు. హాల్ టికెట్ జారీ చేయకుంటే పరీక్షా కేంద్రాని కి వచ్చే వారమే కాదని, అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే తన కూతురికి అన్యాయం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
లింగాల, ఫిబ్రవరి 23 : ఐదో తరగతి ప్రవేశ పరీక్షల్లో ఓఎంఆర్ షీట్ రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురికాగా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5, 6,7, 8, 9 తరగతుల విద్యార్థులకు ఆదివా రం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 990మంది విద్యార్థులకు గా నూ 920 పరీక్షకు హాజరు అయినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. పరీక్షా కేంద్రంలో 10 విద్యార్థులకు ఓఎంఆర్ సీట్ రాకపోవడంతో పరీక్షా కేంద్రం నుంచి తిరిగి పంపేసినట్లు తెలిపారు.
10విద్యార్థులు దరఖాస్తు చేసే సమయంలో కొందరికీ రూ.2లక్షలకు పై గా ఆదాయం, మరి కొంతమంది విద్యార్థులు కుల ధ్రువీకరణ ప త్రాలు తప్పుగా నమోదు చేయడంతో వారికి సొసైటీ నుంచి ఓఎంఆర్ సీట్ రాలేదని తెలిపారు. పరీక్ష రాయకుండా విద్యార్థులు బయటకు వచ్చేయడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఒకటికి రెండుసార్లు చూసుకొని దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.