Telangana Grameena Bank | కల్వకుర్తి రూరల్ : తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా గృహ నిర్మాణాలకు తక్కువ వడ్డీకి గృహ రుణాలను అందిస్తున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు కల్వకుర్తి శాఖ, హైదరాబాద్ ఎక్స్ రోడ్ శాఖల ఆధ్వర్యంలో రుణమేళా నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా బ్యాంకు ఖాతాదారులకు అందించే సేవల గురించి వివరించారు. గృహ రుణాలను ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకి అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్య వ్యాపారం, వ్యక్తిగత, రుణాలతో పాటు గోల్డ్ లోన్ కూడా అందిస్తున్నామని వివరించారు. గృహ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి అతి తక్కువ సమయంలో ప్రత్యేకంగా హబ్ వ్యవస్థను ఏర్పాటు చేసి రుణాలను అందిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎమ్ అశోక్ కుమార్, బ్రాంచ్ మేనేజర్లు చంద్రశేఖర్, శివాజీ రెడ్డి, హబ్ మేనేజర్ రాజేష్, డివో పరశురాం, శివరాం రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్లు తిరుమల్, రామచందర్, రజిత, తదితరులు పాల్గొన్నారు.