సర్వర్ డౌన్.. రిజిస్ట్రేషన్లూ బంద్.. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూ బదలా యింపుల సేవలు నిలిచిపోయాయి. రూ.లక్షలాది ఆదాయం తీసుకొచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆఫీసుల్లో ఈకేవైసీ పనిచేయలేదు. దీంతో క్రయవిక్రయదారులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు తప్పలేదు. మంచి రోజు చూసుకొని.. స్లాట్ బుక్ చేసుకొని ఉత్సాహంగా కార్యాలయానికి వస్తే రిజిస్ట్రేషన్లు కావడం లేదన్న వార్తతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. సాయం త్రం వరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులు శుక్రవారం రావాలని సూచించడంతో నిట్టూర్చుకుంటూ తిరిగి వెళ్లారు.
నాగర్‌కర్నూల్, జూలై 11(నమస్తే తెలంగాణ) : సర్వర్ నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయా ల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన వ్యవసాయేత ర భూముల రిజిస్ట్రేషన్లకు సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలకు గురువారం అంతరాయం ఏ ర్పడింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల నమోదు కో సం ముందస్తుగా స్లాట్లను బుక్ చేసుకున్న పలువు రు గురువారం కార్యాలయాలకు చేరుకోగా సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణం గా 20 నుంచి 30వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతా యి. అయితే ఈ కేవైసీ సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా కార్యాలయాలకు వచ్చిన ప లువురు సాయంత్రం వరకు అక్కడే పడిగాపులు కాస్తూ కనిపించారు. ప్లాట్లు, ఇండ్ల అమ్మకాలు, కొనుగోలుదారులతోపాటు సాక్షులు కూడా కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా మంది కార్యాలయాలకు వచ్చి మధ్యాహ్నం వరకు చూసి వెనుదిరిగారు.
మరికొంత మంది సాయం త్రం వరకు అక్కడే వేచి ఉండడం కనిపించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లోని రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి ఉమ్మ డి జిల్లా నుంచి సంవత్సరానికి రూ.వందల కోట్ల ఆ దాయం వస్తోంది. త్వరలో ప్రభుత్వం భూము ల విలువ పెంచేందుకు సిద్ధమవుతోంది. గత అసెం బ్లీ ఎన్నికల నుంచి డిసెంబర్ వరకు, ఆ తర్వాత పార్లమెంట్, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు రావడంతో మరో మూడు, నాలుగు నెలల వరకు రిజిస్ట్రేషన్లపై ప్రభావం పడింది. ఎల్ఆర్ఎస్పై కూడా స్పష్టత కరువైంది. 2021నుంచి లే అవుట్లపై నిబంధనలు అధికం కావడం జరిగింది. 2019-20 సంవత్సరంలో డీటీసీపీ అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్లను చేసి తర్వాత నిలిపివేశారు. 2022-23లో రిజిస్ట్రేషన్లు తగ్గినా భూముల మార్కెట్ వి లువలు పెరగడంతో స్టాంపు పన్ను, సేవల రుసు ము, బదిలీల సుంకం పెరిగి ఆదాయం వచ్చింది. ఎల్ఆర్ఎస్ కోసం పాలమూరులోని ఐదు జిల్లా ల్లో 64వేల మంది దరఖాస్తు చేసుకొన్నారు. దీనిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇలా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకూ, వెనకకూ అన్నట్లు సాగుతుండగా సాంకేతిక సమస్య ఆ శాఖకు మరింత నష్టం కలిగించనుంది. ఇదిలా ఉంటే సాంకేతిక సమస్యతో తిరిగి వెళ్లిన వారికి కచ్చితంగా శుక్రవారం సేవలు అందుతాయనే సమాచారం మా త్రం ఇవ్వలేదు. ఫోన్లు చేసి కనుక్కొని రావాలనే అనధికారిక సమాచారం మాత్రం లభించడంతో నిట్టూర్చుకుంటూ తిరిగి వెళ్లారు.
మాది తాడూరు. మా ఇల్లు రిజిస్ట్రేషన్ కోసం నాగర్‌కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాం. ఇంతకు ముందే ఆన్లైలో స్లాట్ బుక్ చేసుకున్నాం. గురువారం రిజిస్ట్రేషన్ కోసం వస్తే ఈకేవైసీ పనిచేయడం లేదంటున్నారు. రేపు రావాలని చెప్పారు. రేపు కచ్చితంగా రిజిస్ట్రేష న్ తిరిగి ప్రారంభమవుతుందని మాత్రం చెప్పలేదు. సాయంత్రం వరకు కార్యాలయం వద్దే ఉన్నాం. త్వరగా సమస్యను పరిష్కరించాలి.
అచ్చంపేటలో ఉద యం 10గంటల నుం చి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని స్టాంప్ అం డ్ రిజిస్ట్రేషన్ ఐజీకి ఫోన్ చేసి అడిగినా పీఏ సరిగ్గా స్పందించలేదు. సర్వర్ పని చే యనప్పుడు ముందుగానే సమాచారం ఇస్తే బాగుంటుంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారులు సమాచారాన్ని కూడా ముందుగా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి.
రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ సమ స్య రాలేదు. ఈకేవైపీ రాష్ట్రమంతా నిలిచిపోయింది. నాగర్‌కర్నూల్‌లో రోజూ 20 నుంచి 30 రిజిస్ట్రేష న్లు జరుగుతాయి. హై దరాబాద్‌లోనే సమ స్య ఉంది. శుక్రవారం నాటికి సరిచేస్తామన్నారు. ఈ రోజు నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు రెండు రోజుల్లో చేసేలా చర్యలు తీసుకుంటాం.
జడ్చర్లటౌన్, జూలై 11 : జడ్చర్ల సబ్ రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలో ఆన్లైన్ సాంకేతిక సమస్యతో ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గురువా రం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యాలయంలో ఐదు గంటల వరకు సర్వర్ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్ పనిచేయక కార్యాలయ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ల కో సం వచ్చిన వారందరూ వెనుదిరిగాల్సి వచ్చింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు సర్వర్ ఎప్పుడూ పనిచేస్తోందో, ఎ ప్పుడో పనిచేయదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ని త్యం ఈ సమస్య ఎదురవుతుండటంతో రిజిస్ట్రేషన్లకు ఇబ్బందిగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ విషయంపై కార్యాలయ సిబ్బంది వివరణ కో రగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ సమస్యతో రిజిస్ట్రేషన్లు జరగలేదని చెప్పుకొచ్చారు.
మహబూబ్‌నగర్, జూలై 11 : ఉమ్మడి జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా నిలిపోయాయి. ఎన్నికల అయినప్పటినుంచి ఇప్పటి వరకు భూముల క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్లు మందకొడిగా కావడంతో ఆదాయం పూర్తిగా కొరవడింది. ఈ క్రమంలో గురువారం మహబూబ్‌నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాశారు. సర్వర్ డౌన్‌పై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్లు శాఖ కార్యాలయాల నుంచి ప్రతి రోజు 200నుంచి 250 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండేవి. అయితే సర్వర్ ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేయక పోవడంతో ప్రజలు పడిగాపులు కాశారు. కాగా, గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు దాదాపు రూ.3కోట్ల ఆదాయం వచ్చేది. సర్వర్ డౌన్ కావడంతో ప్రభుత్వానికి రూ.3 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు.
గద్వాల అర్బన్, జూలై 11 : జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు తాసీల్దార్ కార్యాలయాల్లో సాంకేతిక లోపంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఉదయం నుంచి సా యంత్రం వరకు సాంకేతిక సమస్య ఏర్పడడంతో వివిధ గ్రామాల నుంచి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వి షయంపై సబ్ రిజిస్ట్రార్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని వివరణ కొరగా రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక సేవలు నిలిచిపోయాయని అందుకే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని చెప్పారు.