జడ్చర్లటౌన్, డిసెంబర్ 31 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయని డీఈవో రవీందర్ అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన మండలస్థాయి టీఎల్ఎం మేళాకు హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా బోధనోపకరణాలను వినియోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బోధనోపకరణాలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. మేళాలో ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను ప్రదానం చేశారు.
ఆకట్టుకున్న మేళా
బోధనాభ్యాసన సామగ్రి మేళా అందరినీ ఆకట్టుకున్నది. మేళాను జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య ప్రారంభించి ప్రదర్శనలను తిలకించారు. మండలంలోని మొత్తం 63 పాఠశాలల నుంచి 378 రకాల బోధనాభ్యసన సామగ్రిని ప్రదర్శించారు. తెలుగు, గణితం, సైన్స్ పాఠ్యాంశాలపై రూపొందించిన ఉత్తమ ప్రదర్శనలను జిల్లాస్థాయి మేళాకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ మహ్మద్‌అలీ దానిష్, ఎంఈవో మంజులాదేవి, కౌన్సిలర్ రఘురాంగౌడ్, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొంగలి నాగరాజు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గోవింద్‌నాయక్, తాహేర్, యలకంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మెళకువలు పాటించాలి
విద్యాబోధనలో మెళకువలు పాటించి విద్యార్థులకు సులభ పద్ధతిలో పాఠ్యాంశాలను బోధించాలని డీఈవో రవీందర్ సూచించారు. మూసాపేట ఎమ్మార్సీ భవనంలో శనివారం మండలస్థాయి టీఎల్ఎం మేళా ఏర్పాటు చేయగా, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, డిప్యూటీ తాసిల్దార్ వరప్రసాద్ ప్రారంభించారు. మేళాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను డీఈవో రవీందర్ తిలకించి ప్రతిభకనబర్చిన ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం డీఈవోను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్లు గోపాల్రాజు, శ్రీనివాసులు, లక్ష్మణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన ఫలితాలు సాధించాలి
బోధనోపకరణాలతో మెరుగైన ఫలితాలు సాధించాలని జెడ్పీటీసీ శశిరేఖాబాలు అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం టీఎల్ఎం మేళాలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థు లు సులభంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు బోధనోపకరణాలను రూపొందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్సై రాంలాల్‌నాయక్, స ర్పంచ్ రాధికారెడ్డి, ఎంపీటీసీ గౌస్, ఎంఈవో మంజులాదే వి, ఉపాధ్యాయులు సుధాకర్, రవికుమార్, నర్సింహులు, మల్లయ్య, వెంకటయ్య, వసంత్, జానకమ్మ, ప్రియాంక, వినోదు, గౌతమి, మోహన్‌కుమార్, శ్రీనివాసులు ఉన్నారు.
సులభ పద్ధతిలో బోధించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సులభ పద్ధతుల్లో విద్యాబోధన చేయాలని ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. భూత్పూర్ ఉన్నత పాఠశాలలో శనివారం టీఎల్ఎం మేళాను మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్తో కలిసి ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు బోధనోపకరణాలను రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. కాగా మేళాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను డీఈవో రవీందర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో నాగయ్య, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, హెచ్ఎంలు సంగీత, శంకరాచారి, కవిత, సీఆర్పీలు ఇక్రమ్, ఠాగూర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
అబ్బురపర్చిన ప్రదర్శనలు
మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం నిర్వహించిన టీఎల్ఎం మేళా ఆకట్టుకున్నది. మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాల ప్రదర్శనలు అబ్బురపర్చాయి. టీఎల్ఎం మేళాను ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి ప్రారంభించి ప్రదర్శనలను తిలకించారు. తెలుగు విభాగంలో పోమాల, బట్టోనిపల్లితండా, కాకర్జాల్తండా, మల్లారెడ్డిపల్లి, రంగయ్యబావితండా, ఇంగ్లిష్ విభాగంలో కొల్లూరు, చౌడూర్, ఇప్పటూర్, పోమాల, చెన్నారెడ్డిపల్లి, గణితంలో ఇప్పటూర్, సిద్దోటం, పూన్యానాయక్తండా, దొడ్డిపల్లి, కుమ్మరిగడ్డతండా, సైన్స్ విభాగంలో రుక్కంపల్లి, కారుకొండ, కాకర్లపహాడ్, మల్లారెడ్డిపల్లి, ఇప్పటూర్ పాఠశాలలను ఎంపిక చేసినట్లు ఎంఈవో రాజూనాయక్ తెలిపారు. ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండె లక్ష్మయ్య, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, నోడల్ అధికారి జగదీశ్‌కుమార్, జీహెచ్ఎంలు రెహానాబేగం, వెంకటేశ్వరమ్మ, ఉషారాణి, సర్పంచ్ గోపాల్‌గౌడ్, ఉపాధ్యాయ సంఘం నాయకులు బాలరాజు, రాములు, సదాశివుడు, రాజశేఖర్‌రెడ్డి, రవిశంకర్, సీఆర్పీ జనార్దన్ పాల్గొన్నారు.