జడ్చర్లటౌన్, నవంబర్10 : ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు విద్యార్థి కర్ణభేరి దెబ్బతిన్న ఘటన జడ్చర్లలోని స్వామి నారాయణ్ గురుకల్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యా ర్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆం దోళన చేపట్టాయి. విద్యార్థి తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన బీ సిద్దార్థచారి(14) ఈ ఏడాది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని స్వామి నారాయణ్ గురుకుల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
పాఠశాలలో గణితశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు నాగరాజు ఈనెల7వ తేదీన 8వ తరగతి క్లాస్‌రూంలోకి వచ్చి విద్యార్థులకు హోం వర్క్ చూపించాలన్న క్రమంలో ముందు బెంచీపై కూర్చున్న విద్యార్థి సిద్దార్థచారి హోంవర్స్ బుక్ కోసం వెనుక బెంచీ వైపు వెళ్లడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయుడు నాగరాజు కోపంతో విద్యార్థి చెవిపై కొట్టా డు. వరుసగా నాలుగైదు సార్లు విద్యార్థి చెవిపై కొట్టటంతో ఒక్కసారిగా చెవిలో నుంచి రక్తం కారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పాఠశాల నిర్వాహకులు వెంటనే విద్యార్థి చెవిలో డ్రాప్స్ వేసి వదిలేశారు. సదరు విద్యార్థి చెవి నొప్పి అవుతుండడంతో ఈ విషయాన్ని ఫోన్లో తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ఈనెల 8వ తేదీన ఉదయం విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకోగా, పాఠశాల యా జమాన్యం, ఉపాధ్యాయులు అందుబాటు లో లేకపోవటంతో గాయపడిన తమ కు మారుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఈఎన్టీ దవాఖానలో చూయించగా విద్యార్థి చెవి కర్ణభేరి పూర్తిగా దెబ్బతిందని, వినికిడి సైతం కొల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు సూచించడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు సోమవారం స్వామి నారాయణ్ గురుకుల్ పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వి ద్యార్థి సంఘాలు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.
విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు నాగరాజును సస్పెండ్ చేశామంటూ పాఠశాల ప్రిన్సిపాల్ చెబుతూ నే మరోవైపు సదరు ఉపాధ్యాయుడిని పాఠశాలలోనే ఓ గదిలో ఉంచారని తెలుసుకు న్న విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా దాడికి యత్నించారు. ఈ సందర్భంగా పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళలను విరమించేందుకు యత్నించారు.
పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని ఓ వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా నిమ్మబావిగడ్డ ప్రాంతంలో ఓ విద్యార్థి సంఘం నాయకులు వాహనాన్ని అడ్డగించి ఉపాధ్యాయుడు నాగరాజుపై దాడికి యత్నించారు. పోలీసులు జొక్యం చేసుకొని విద్యార్థి సం ఘం నాయకులను అక్కడి నుంచి పంపిం చి ఉపాధ్యాయుడు నాగరాజును పోలీసుస్టేషన్‌కు తరలించారు. గతంలోనూ సదరు ఉపాధ్యాయుడు నాగరాజు విద్యార్థులపై చేయిచేసుకున్నట్లు పలువురు విద్యార్థులు తెలియజేస్తున్నారు.
తమ కుమారుడి చెవికర్ణభేరి దెబ్బతినేలా కొట్టిన ఉపాధ్యాయుడు నాగరాజుతో పాటు నిర్లక్ష్యం వహించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పేర్కొం టూ సోమవారం విద్యార్థి తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.