పాలమూరు, మే 20 : ఉపాధ్యాయ అర్హత ఆన్లైన్ పరీక్షను సోమవారం స్థానిక జేపీఎన్సీఈ, ఫాతిమా విద్యాలయ పాఠశాలలో నిర్వహించారు. అ భ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగానే చేరుకోగా ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 4:30 గం టల వరకు కొనసాగింది. మొత్తం 738 మందికి గా నూ 680 మంది పరీక్షకు హాజరుకాగా 58మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.