National Level Competitions | మాగనూరు మార్చి 19 : ఆల్ ఇండియా సివిల్ సర్వీస్‌లో జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు మాగనూరు మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు బీ దీప ఎంపికైనట్లు నారాయణపేట జిల్లా డివైఎస్ఓ వెంకటేష్ శెట్టి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత జనవరి 23, 24 తేదీలలో సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ మహిళా రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొని క్రీడా ప్రతిభను క్రీడా నైపుణ్యతను ప్రదర్శించి జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్ ఖో ఖో పోటీలకు ఎంపిక అయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఈనెల 21 నుండి 24 వరకు న్యూఢిల్లీలో జరుగు జాతీయ స్థాయి ఖో ఖో పోటీలలో బీ దీప పాల్గొననున్నారు.
బీ దీప మక్తల్ మండల కేంద్రంలోని (జిపి) ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన దీపను నారాయణపేట జిల్లా క్రీడల అధికారి డివైఎస్ఓ వెంకటేష్ శెట్టి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాగనూరు,మక్తల్ మండలం ఎంఈఓలు, ఉపాధ్యాయుల బృందం అభినందించారు.