అయిజ, జూన్ 24 : కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు సరికొత్త రూపును సంతరించుకొన్నది. రూ. 51కోట్ల వ్యయ ంతో 33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తికాగా, గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలు ప్రారంభించనున్నారు. 73ఏండ్ల కిందట నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు మూడు రాష్ర్టాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. 2024 ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టులోని 19గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీ టి వృథాను అరి
కట్టేందుకు ఇంజినీరింగ్ నిపుణుల సూచనలతో స్టాప్‌లాక్ గేటు తాత్కాలికంగా అమర్చారు. అనంతరం డ్యామ్‌ను పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) 33 స్పిల్ వే గేట్లు మార్చాలని నివేదిక ఇవ్వడంతో 6 నెలల్లో కొత్తగేట్లను పూర్తి చేశారు. పలు గ్రామాలకు సాగు, తాగునీరు టీబీ డ్యాంతో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీ రు, వందల పల్లెలకు తాగునీరుతో కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు కీలకంగా ఉంది. గేట్ల బిగింపుతో 50 ఏండ్ల వరకు డ్యాం సేఫ్టీగా ఉంటుందని ఇం జినీరింగ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.