నాడు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన జిల్లా.. నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ఎదిగిందని, తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్‌నగర్ రూపురేఖలు మారిపోయాయని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ మినీ శిల్పారామంలో బుధవారం టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివిటిపల్లి శివారులో నిర్మించిన ఐటీ కారిడార్‌లో స్థానికంగా ఉన్న 650 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్‌మేళాను నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే నెల 2వ తేదీన 10 వేల జాబ్లకు మేళా నిర్వహిస్తామన్నారు. శిల్పారామం ఆవరణలో వండర్లా ఏర్పాటు చేస్తామన్నారు. 13వ తేదీన 450 డ్రోన్లతో జిల్లాస్థాయిలోనే అతిపెద్ద ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాల నాయకులు నీచ, కుట్ర రాజకీయాలు మానుకొని.. పార్టీలకతీతంగా అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
మహబూబ్‌నగర్ అర్బన్ ఆగస్టు 9 : వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లా ప్రసుత్తం ఐటీ ఉద్యోగాలు అం దించే స్థాయికి ఎదిగి ఉపాధి ఖిల్లాగా మారిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ఉద్దేశంతో మొదటి విడుతగా దివిటిపల్లి ఐటీ కారిడార్‌లో 650మంది ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2న మరో మెగా జాబ్‌మేళా నిర్వహించి 10వేల మంది స్థానిక నిరుద్యోగులకు ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల కో సం కాలక్షేపం చేయకుండా ప్రైవేట్ ఉ ద్యోగాలు చేసి కుటుంబానికి తోడుగా నిలువాలని సూచించారు. సెప్టెంబర్ 2న 100 కంపెనీలతో 10వేల మంది ఉ ద్యోగాలు కల్పించే విధంగా మరో జాబ్ మేళా నిర్వహిస్తామని, ఇవాళ జాబ్ మే ళాలో అవకాశం రానివారికి మెగా జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తామన్నారు.
13న డ్రోన్ షో..
ఇప్పటికే వర్షం కారణంగా మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించే డ్రోన్ షో ఈ నెల 13న ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.650 డ్రోన్లతో సాయంత్రం 7 గంటలకు నిర్వహిస్తామన్నారు.
ఎలాంటి ఉద్యోగమైనా చేరాలి: కలెక్టర్ రవినాయక్
నిరుద్యోగ యువత ఎలాంటి ఉద్యోగం వచ్చినా చేరాలని, మీ నైపుణ్యాన్ని బట్టి అనేక మంచి ఉద్యోగాలు లభిస్తాయని కలెక్టర్ రవినాయక్ అన్నారు. ఇక్కడ హాజరైన నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్త్తాయని, నైపుణ్యత లేనివారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించే కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నర్సింహ, టాస్క్ డైరెక్టర్ ప్రదీప్‌రెడ్డి, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి ఆర్ఎం కృతజ్ఞతలు
మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 9 : టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై మహబూబ్‌నగర్ రీజినల్ మేనేజర్ శ్రీదేవి బుధవారం జిల్లాకేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మహబూబ్‌నగర్ డిపో మేనేజర్ సుజాత, టీఎం యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌గౌడ్ ఉన్నారు.
జిల్లా క్లబ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ/ అర్బన్, ఆగస్టు 9: జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ క్లబ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కొత్త హంగులతో అత్యాధునికంగా మారుస్తామన్నారు. బుధవారం జిల్లా క్లబ్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. క్లబ్ ఆధునీకరణ కోసం నిధులు కేటాయించాలని క్లబ్ కార్యవర్గ సభ్యులు మంత్రిని కోరగా, ఆధునిక భవనాల ని ర్మాణం కోసం రూ. 1.50 కోట్ల నిధుల ను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్లబ్ వద్ద జరుగుతున్న పనులను మంత్రి క్లబ్ పాలవర్గంతో కలిసి పరిశీలించారు. కుటుంబ సమేతంగా సభ్యులంతా వచ్చేలా నిర్వహణ ఉండాలని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయాల సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, జిల్లా క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్ కు మార్, మల్లు నర్సింహారెడ్డి ఉన్నారు.
నూతన ఎస్పీ కార్యాలయానికి స్థల సేకరణ చేస్తాం
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 9 : నూతన ఎస్పీ కార్యాలయానికి బైపాస్ పరిసర ప్రాంతాల్లో స్థలం సేకరణ చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపినట్లు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటయ్య తెలిపారు. బుధవారం జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రిని పో లీసు అసోసియేషన్ సభ్యులు కలిశారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు చిన్న మద్దిలేటి, ప్రసాద్, పద్మలత తదితరులు పాల్గొన్నారు.