వెల్దండ : స్వేరోస్ నెట్వర్క్ (Sweros Network) రాష్ట్రాలు దాటుతూ విశ్వవ్యాప్తం అవుతున్నదని ఆ టీం, బీఆర్ఎస్ (BRS) నాయకుడు దొబ్బల భాస్కర్ అన్నారు. మహనీయుల ఆశయ సాధనకు, అనునిత్యం ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వేరోయిజమన్నారు. స్వేరోస్ సిద్ధాంతాలు ప్రతి వ్యక్తి ఆచరించే విధంగా, సమాజ శ్రేయస్సుకు పాటు పడుతున్నదన్నారు. జ్ఞాన సమూపార్జనే ధ్యేయంగా, జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా కొనసాగుతున్నదన్నారు.
బహుజన మేధావి మాన్యవర్ కాన్షిరామ్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది మార్చి 15 న పవిత్ర మాసం ప్రారంభమై, ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్అంబేద్కర్ జయంతి రోజున భీమ్ దీక్ష ముగుస్తుందన్నారు.ఈ ఏడాది భీమ్ దీక్ష ముగింపు సభకు స్వేరోస్ సృష్టికర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. కాబట్టి మనలోని భయాన్ని విముక్తి చేసుకొనుటకు తప్పకుండా ఏప్రిల్ 13న సాయత్రం 7 గంటలకు తలకొండ పల్లిలో భీమ్ దీక్ష ముగింపు సభలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.