మహబూబ్ నగర్ : జడ్చర్ల మండలం పలుగుగడ్డ తండాకు చెందిన పీజీ వైద్య విద్యార్థి ( PG Medical Student) సురేష్ మృతి పట్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి( Former Minister Laxmareddy ) తీవ్రవిచారం వ్యక్తం చేశారు. పలుగుగడ్డ తండాలో సురేష్ పార్థివ దేహానికి పూలమాల వేసి మాజీ మంత్రి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఎంతో కష్టపడి చదివి ఉస్మానియాలో పీజీ సీటు సాధించిన సురేష్ ( Student Suresh ) అనుమానాస్పదంగా మృతి చెందడం బాధాకరం అన్నారు. పేద గిరిజన విద్యార్థి చనిపోతే మెడికల్ కాలేజ్ సిబ్బంది,ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఈ ఘటన నిదర్శనమని మండిపడ్డారు.
సురేష్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.సురేష్‌కు ఎస్వీఎస్ కాలేజ్ లో ఎంబీబీఎస్ సీటు వచ్చిన సందర్భంలో అభినందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.