జోగులాంబ గద్వాల : విధుల్లో నిర్లక్ష్యం చేసిన ఇద్దరు ఐకేపీ ఉద్యోగులను( IKP Employees ) జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సస్పెన్షన్ ( Suspension ) చేశారు. ఒకరికి మెమో జారీ చేశారు. గద్వాల మండలం తెలుగోనుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అక్కడ నిర్వహణ లోపాలను గమనించి , వీవోఏ అలివేలును, సీసీ రంగన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఎం దేవానందంకు మెమో జారీ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఎంతో సీరియస్ గా ఉందని, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ రైతులను ఇబ్బంది పెట్టే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.