మహబూబ్‌నగర్ కలెక్టరేట్, అక్టోబర్ 2 : ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నిటికీ ఉపయోగపడేలా కార్డులను రూ పొందించి.. లబ్ధిదారులకు అం దించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఒక రాష్ట్రం.. ఒకే డిజిటల్ కార్డు (వన్ స్టేట్.. వన్ డిజిటల్ కార్డ్) విధానంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇందు లో భాగంగానే ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేక బృందాల తో కుటంబ వివరాలు సేకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.
కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు సిద్ధం చేయనున్నారు. వీటితో లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందే లా ఈ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుడి హెల్త్ ప్రొఫై ల్ (ఆరోగ్య సమాచారం) ఉండనున్నది. ఆయా కుటుంబాల్లో కొత్త సభ్యుల చేరిక, తొలగింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు కార్డును అప్డేట్ చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గం పర్యవేక్షక అధికారిగా మహబూబ్‌నగర్ ఆర్డీవో, జడ్చర్ల నియోజకవర్గానికి జెడ్పీ సీఈవో, దేవరకద్ర నియోజకవర్గానికి భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను నియమించారు. టీమ్ లీడర్లుగా తాసీల్దార్లు, ఎంపీడీవో లు, మున్సిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారు. సభ్యులుగా పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందిని నియమించారు. ప్రతి నియోజకవర్గంలో గ్రామానికి రెండు బందాలు, మున్సిపాలిటీలో 4-6 బృందాలు ఉంటాయి. ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, ఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తల సహకారం తీసుకోనున్నారు.
డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాలు, వార్డులను ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం మాధారం, మహబూబ్‌నగర్ 37వ వార్డు, జడ్చర్ల మండలం అల్వాన్‌పల్లి, జడ్చర్లలోని 24వ వార్డు, సీసీకుంట మండలం సీతారాంపేట, భూత్పూరులోని 9వ వార్డు ఎంపికైంది.
టీమ్ లీడర్లు, సభ్యులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామం, వార్డుల్లోని కుటుంబాల వివరాలు సేకరించనున్నారు. ప్రజలు అందుబాటులో ఉండి తమ కు టుంబ వివరాలు నమోదు చేసుకోవాలి. కుటుం బ సమగ్ర వివరాలతోపాటు ఫొటో విధిగా ఉండే లా సర్వే బృందా లు జాగ్రత్తలు తీసుకోవాలి.
-విజయేందిరబోయి, కలెక్టర్, మహబూబ్‌నగర్