మాగనూరు : మాగనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిషన్ భగీరథ లీకేజీ ( Mission Bhagiratha leakage ) తో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు సమ్మర్ క్యాంపు ( Summer Camp ) నిర్వహిస్తున్నారు.
అయితే అదే పాఠశాల గేటు సమీపంలో మిషన్ భగీరథ పైప్లైన్ నుంచి లీకేజీ కావడంతో నీరు వదిలిన ప్రతిసారి పాఠశాల ఆవరణలో వచ్చి వృథాగా రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో పాఠశాల ఆవరణ బురద మయంగా మారుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మర్ క్యాంపులో పాల్గొంటున్న విద్యార్థులకు ఆటలాడుకునే సమయంలో అవరోధాలు ఏర్పాడుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు మూడు రోజుల కిందటే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సమ్మర్ క్యాంపును దృష్టిలో ఉంచుకొని పైప్ లైన్ లీకేజీ మరమ్మతులు చేపట్టి త్వరగా పూర్తిచేయాలని గ్రామస్థులు కోరారు.