మహబూబ్ నగర్ కలెక్టరేట్ : ప్రతి విద్యార్థి జీవితంలో పది, ఇంటర్తరగతులు ఎంతో ముఖ్యమైనదని, నిర్దిష్ట ప్రణాళికతో ( Specific plan ) చదివి జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగాలని పీయూ వీసీ ఆచార్య జీఎన్ శ్రీనివాస్ (VC Acharya Srinivas) తెలిపారు. బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్(BCTA) ఆధ్వర్యంలో పదవ తరగతిలో టాపర్గా నిలిచిన 2వందల మంది విద్యార్థులకు, అధ్యాపకులకు మహాత్మ జ్యోతిబాపూలే ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను ఎన్నడూ మరవకూడదని పేర్కొన్నారు. బాగా కష్టపడి చదివిన విద్యార్థులకు విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అవకాశాలని అందిపుచ్చుకొని జీవితంలో ఎదగాలని సూచించారు. టాపర్ గా నిలిచిన విద్యార్థులకు పురస్కారాలు, వారి తల్లిదండ్రులను శాలువా, మెడల్స్ తో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, జేపీఎన్సీ చైర్మన్ కె ఎస్ రవికుమార్, డీఈవో ప్రవీణ్ కుమార్, బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు, గురు ప్రసాద్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్, ధనంజయ, రాష్ట్ర కోశాధికారి రమేష్, జిల్లా కోశాధికారి మల్లేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.