తిమ్మాజిపేట : సమాజంలో ఉపాధ్యాయులకు ( Teachers ) గౌరవప్రదమైన స్థానం ఉందని, సమాజాన్ని తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమైనదని ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి ( MLC Damodar Reddy ) అన్నారు. శుక్రవారం తిమ్మాజీపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, నైతిక విలువల కూడిన రాబోయే తరాన్ని తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు.
కొంతమంది విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారని, ముఖ్యంగా డ్రగ్స్, సెల్ ఫోన్లు లాంటి కి బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడిపించేలా కృషి చేయాలని సూచించారు. ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి , ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంఈవో సత్యనారాయణ శెట్టి, ఆర్పీలు జయపాల్ రెడ్డి, సుధాకర్ గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.