వనపర్తి టౌన్, అక్టోబర్ 23 : విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి రమేశ్, జిల్లా అధ్యక్షుడు నరేశ్ డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి కొత్త బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కళాశాల విద్యార్థులతో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. లేదంటే విద్యార్థులను సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని తాసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు శ్రీరామ్, గోపాలకృష్ణ, అరవింద్, భానుప్రకాశ్, చరణ్, గణేశ్, జస్వంత్, బన్ని, శివయాదవ్, శివ, భాను తదితరులు ఉన్నారు.
మక్తల్, అక్టోబర్ 23 : రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అందించాల్సిన స్కాలర్షిప్లను వెంటనే విడుద ల చేయాలని ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవా రం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తాసీల్దార్ సతీశ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాసర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.6,350 కోట్ల ఫీజు రీయింబర్స్మెం ట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తుందన్నా రు. వెంటనే స్పందించి పెండింగ్ నిధులు మంజూ రు చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు శేఖర్, అజయ్, చెన్నయ్య, విజయ్, గణేశ్, రాజశేఖర్‌తోపాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.