ఆత్మకూరు, సెప్టెంబర్ 25 : బస్సులు ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మండలంలోని పిన్నెంచర్ల గేటు వద్ద బుధవారం విద్యార్థు లు, మహిళలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ప్రయాణాలు ఇబ్బందికరంగా మారాయన్నారు. బస్సు డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ స్టేజీల వద్ద బస్సులు నిలపకుండా వెళ్లిపోతున్నారన్నారు.
మహిళలు, విద్యార్థులు స్టేజీల వద్ద నిలబడ్డా ఆ పడంలేదన్నారు. ఈ సమస్యను ఇప్పటికే ఎమ్మె ల్యే శ్రీహరికి తెలిపినా ప్రయోజనం లేకుండాపోయిందని ఆరోపించారు. రాస్తారోకోతో రాకపోకలు నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న సీఐ శివకుమార్ అక్కడికి చేరుకొని విద్యార్థుల ను సముదాయించారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరడంతో మహబూబ్‌నగర్ డిపో మేనేజర్‌తో బస్సులు ఆపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకుడు మనోహర్‌గౌడ్, గ్రామస్తులు అశోక్భూపాల్, కరుణాకర్‌గౌడ్, అశోక్నంద, శి వశంకర్, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.