మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జులై 23 : నీట్ అక్రమాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ పాలమూరులో గురువారం విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పెద్దఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల చర్యను నిరసిస్తూ తీ వ్రస్థాయిలో యువత, విద్యార్థి సంఘా ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ ధర్నా చౌక్ నుంచి తెలంగాణ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగులపై నిరంకుశ పాలనను అనుసరిస్తుందన్నారు. ఎన్టీఏ సంస్థ దాదాపు 8వసారి తప్పు చేసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తక్షణమే ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌ను సస్పెండ్ చేయాలని పెద్దఎత్తున నినదించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా చనిపోయిన విద్యార్థి కుటుంబానికి రూ. 2కోట్లు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయకపోతే విద్యార్థి, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భరత్, ఏఐఎస్ఎప్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సీతారాం, విద్యార్థి నాయకులు రాజు, నందు, ఈశ్వర్, రా జశేఖర్, శివ, జీషాంత్, మారుతి, మ హేశ్, వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు, వైద్యులు మ ధుసూదన్రెడ్డి, ప్రతిభ, రాఘవాచారి, ఖలీల్, పరమేశ్, కిల్లెగోపాల్, మేధావులు, డాక్టర్లు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూలై 23: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్‌ను బీఆర్ఎస్వీ నాయకులు ఖం డించారు. గురువారం పాలమూరు యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ పీయూ అధ్యక్షుడు భరత్‌బాబు ఆధ్వర్యంలో పీజీ కాలేజీ వద్ద విద్యార్థుల నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ ఘటనపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిరసనలో బీఆర్ఎస్వీ నాయకులు నగేశ్‌రెడ్డి, ఆంజనేయులు, భరత్, రాణా ప్రతాప్, పరుశరామ్, కృష్ణ, శివప్రసాద్, బాలకృష్ణ, శ్రీకర్ పాల్గొన్నారు.