కొత్తకోట, నవంబర్ 10 : కొత్తకోట మండలంలోని అమడబాకుల జాతీయ రహదారి పక్కన కొనసాగుతున్న మైనార్టీ గురుకుల కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ది నవీన్ భీమా ఫేస్-2 కాల్వలో పడి మృతి చెందిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ప్రిన్సిపాల్ షహ అంజుమ్ తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు స్టడీ అవర్స్ జరిగాయని భోజన విరామం అనంతరం మధ్యా హ్నం విద్యార్ధులకు బట్టలు ఉతకాడానికి వి రామం ఇచ్చామని తెలిపారు. అందులో భా గంగా విద్యార్థులు బయటికి వెళ్లారని, ప్రహరీ లేనందున మహబూబ్‌నగర్‌కు చెందిన నవీన్ బయటికి వెళ్లాడన్నారు.
ఆదివారం సా యం త్రం 7గంటలకు విద్యార్ధి నవీన్ కళాశాలలో కనబడకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆచూకీ కోసం వెతకడం ప్రారంచామని, రాత్రి 9గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని భీ మా ఫేస్-2 కాల్వలో మృతదేహం ఒక రైతు కు కనబడగా ఆయన ఇచ్చిన సమాచారం మేరకు శవాన్ని స్వాధీనం చేసుకొని వనపర్తి ఏరియా దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు చనిపోయిన నవీన్ వెంట మైనార్టీ కళాశాలకు చెందిన మరో నలుగురు విద్యార్ధులు మాలిక్, చందు, గౌస్, పురుషోత్తం వెళ్లినట్లు పోలీసులు విచారణలో భాగంగా కాల్వకు సమీపంలోని ఒక రైస్ మిల్లులో సీసీ పుటేజ్ పరిశీలించగా బయటపడింది. కళాశాలకు ప్రహరీ లేకపోవడం, పర్యవేక్షణ లోపంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.
సమాచారం తెలుసుకున్న సీఐ రాంబాబు, ఎస్సై ఆనంద్‌తోపాటు ఆర్ఎల్సీ ఖాజా బహదూర్, వనపర్తి డీఎండబ్ల్యూవో అఫ్జలొద్దీన్, కళాశాల విజిలెన్స్ ఆఫీసర్ జమీర్‌ఖాన్ మైనార్టీ కళాశాలకు సందర్శించి విద్యార్ధి నవీన్ చనిపోవడానికి గల కారణాలపై విచారణ జరిపారు. ఇదిలా ఉండగా కాల్వలో పడి చనిపోయిన విద్యార్ధి నవీన్ తల్లి భాగ్యలక్ష్మి మహబూబ్‌నగర్‌లోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో హౌ స్ కీపింగ్‌గా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నట్లు, తండ్రి విష్ణువర్ధన్ కూలి పని చేస్తున్నట్లు తెలిసింది. చేతికు వచ్చిన కొడుకు అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యంతో జలసమాధి అ య్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గురుకుల విద్యార్థి మృతిపై..
వనపర్తి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : కొత్తకోట మైనార్టీ గురుకుల ఇంటర్ విద్యార్థి నవీన్ భీమా కాల్వలో పడి మృతి చెం దిన ఘటనపై బాదిత కుటుంబ సభ్యులు జిల్లా దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. కొత్తకోట నుంచి నవీన్ మృతదేహాన్ని వనపర్తి జిల్లా దవాఖానకు సోమవారం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోష్టుమార్టంకు ముం దు కుటుంబ సభ్యులతోపాటు వివిధ సం ఘాల ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు బాధితుల ను రోడ్డు నుంచి బలవంతంగా పక్కకు త ప్పించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న ఆర్డీవో సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు.
కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగంతోపా టు లక్ష రూపాయలు గురుకులాల సం స్థ నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చా రు. కాగా, రాష్ట్ర గురుకులాల కార్యదర్శి షఫియుల్లా ఖాన్‌ను బాధితులు ఫోన్లో సంప్రదించారు. ఘటనపై గురుకుల ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. అధికారుల హామీ తో పో స్టుమార్టానికి అంగీకరించగా, అనంతరం బా డీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇది లా ఉంటే.. నవీన్ తల్లితండ్రులు ఆది విష్ణువర్ధన్,ఆది లావణ్యలకు ఒకే కొడుకు కావడంతో కన్నీరు మున్నీరయ్యారు.