పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌కు చెందిన తుప్పరి కృష్ణయ్య ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
- హాస్టల్లో ఉరేవేసుకొన్న విద్యార్థి
- ఆత్మహత్యపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
మహబూబ్‌నగర్, జూన్ 9 : పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌కు చెందిన తుప్పరి కృష్ణయ్య ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు తుప్పరి కార్తీక్ (23) ఉన్నారు. కార్తీక్ పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేడేట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వేసవి సెలవులు ముగియడంతో సోమవారం రాత్రి 9:45 హాస్టల్‌కు వచ్చాడు.
మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో రూం నెం బర్ 33 గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించాడు. ఈ క్రమంలో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో స్నేహితులు వెళ్లి చూడగా రూం తెరుచుకోలేదు. అందరూ మిత్రులు కలిసి తలుపులను గట్టిగా తోయగా తలుపులు తెరుచుకున్నాయి. కాగా కార్తీక్ ఫ్యాన్‌కు తన బెడ్‌షీట్‌తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గు ర్తించారు. వెంటనే వాచ్మెన్ నర్సింహ, మిత్రుడు వంశీకృష్ణ కలిసి కార్తీక్‌ను కిందికి దించి మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు కార్తీక్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విష యం తల్లిదండ్రులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకొని తన కొడుకు మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీసుల విచారణ
కార్తీక్ పీయూ హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఎస్సై విజయ్‌కుమార్ ఘటనా స్థ లాన్ని పరిశీలించారు. కార్తీక్ ఫోన్‌ను స్వాధీనం చే సుకొని, రాత్రి హాస్టల్ ఉన్న విద్యార్థుల వద్ద జరిగి న ఘటనపై విచారించారు. తన మిత్రుడు పీ యూ లో చదువుతున్న మణికుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడని నేను కూడా అలానే చనిపోతున్నాననిచెప్పాడని పోలీసులకు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

