కల్వకుర్తి, మే 24 : ప్రభుత్వం అనుమతులిచ్చిన చోట కాకుండా తమ ఊరి సరిహద్దులో ఇసుకను తవ్వి డంపులుగా పోయడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు కల్వకుర్తి మండలం గుండూరు గ్రామ ప్రజలు.. తాడూర్ మండలం పొలుమూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఇసుకను తవ్వేందుకు అనుమతులిస్తే గుండూర్ సరిహద్దుల్లో ఇసుకను తవ్వి తమ గ్రామంలోనే ఎందుకు డంప్ చేస్తున్నారని ప్రజలు నిలదీశారు. పెద్ద పెద్ద టిప్పర్లు తమ గ్రామంలోకి రావడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సరిహద్దుల్లోని దుందుభీ వాగు (పెద్దవాగు) నుంచి ఇసుకను తీస్తే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాగును నమ్ముకొని గ్రామమంతా బతుకుతుందని, త మ ఊరి సరిహద్దులో ఇసుక తీసి ఇసుక డంపులు పో యడాన్ని వ్యతిరేకిస్తూ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.
రెండ్రోజుల కిందట గుండూర్లో ప్రజలు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దుందుభీ వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి గ్రామంలో డంప్ చేస్తున్నారు. నెల రోజులుగా ఈ తతంగం జరుగుతున్నది. ఎంపీ ఎన్నికల కారణంగా పది రోజులు ఇసుక దందా చేయలేదు. రెండ్రోజుల కిందటే 40 టిప్పర్లు ఇసుక డం పు వద్దకు చేరుకోగా గ్రామస్తులంతా ఏకమై అక్కడికి చే రుకొని అడ్డుకున్నారు. అనుమతులున్న చోట కాకుండా ఇక్కడెందుకు ఇసుకను తవ్వుతున్నారని ప్రశ్నించారు. ఊరి సరిహద్దుల్లో ఇసుకను తవ్వి ఇక్కడే డంప్ చేసి తరలిస్తామంటే ఊరుకోమని హెచ్చరించడంతో ఇసుక మా ఫియా వెనుదిరిగింది.
గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడి అండతోనే ట్రాక్టర్లు గురువారం రాత్రి వాగులోకి వెళ్లే ప్రయ త్నం చేశాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుపడి.. అనుమతులున్న దగ్గరే ఇసుకను తీయాలని, ఇ క్కడ డంప్ చేయొద్దని తేల్చి చెప్పారు. కాగా ఊళ్లోని ట్రా క్టర్లకు పని దొరికితే ఎందుకు అడ్డుకుంటున్నారని వాహనాల యాజమానులు గ్రామస్తులతో వాదనకు దిగారు. ఘర్షణకు దారితీస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.
నాగర్‌కర్నూల్ నియోజవర్గానికి చెందిన ఇద్దరు వ్య క్తులకు తాడూర్ మండలం పొలుమూరు వద్ద ఇసుకను తీయడానికి అనుమతులున్నాయి. ప్రభుత్వం పొలుమూరు వద్ద దుందుభీ వాగులో రీచ్‌లను గుర్తించి అక్క డి నుంచి ఇసుకను తీయాలని ప్రొసీడింగ్‌లు ఇచ్చింది. మొదటిసారి 70 టిప్పర్లకు, రెండోసారి 62 టిప్పర్లకు అనుమతులిచ్చింది. ఎన్నికలు ముగియడంలో మూడోసారి 62 టిప్పర్లకు అనుమతులొచ్చాయి. ఈ క్రమంలో సదరు వ్యక్తులు పొలుమూరు నుంచి కాకుండా గుం డూర్ సరిహద్దులో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి గ్రామంలోనే డంపుగా పోశారు. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా కల్వకుర్తితోపాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ తతంగమంతా నెలరోజులుగా కొనసాగుతున్నది.
60 నుంచి 70 టిప్పర్లకు అనుమతులు పొంది వందలాది టిప్పర్ల ఇసుకను తవ్వుతున్నారు. అదికూడా అనుమతిచ్చిన చోట కాకుండా మరోచోట. బాహాటంగా ఇసుక దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అధికార పా ర్టీకి చెందిన వారే ఇసుక మాఫియాను నడిపిస్తున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇసుక లోడ్‌తో టిప్ప ర్లు హైదరాబాద్‌కు అధికారుల కంట్లో పడకుండా ఎలా వెళ్తున్నాయన్నదే పెద్ద ప్రశ్న. అంత పెద్ద వాహనాలు ని బంధనలకు విరుద్ధంగా 40 నుంచి 50 టన్నుల ఇసుక లోడ్‌తో వెళ్తుంటే పోలీస్, రెవెన్యూ, మైన్స్ శాఖల అధికారులకు కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని కల్వకుర్తివాసులు చర్చించుకుంటున్నారు.