ఊటూర్, నవంబర్ 12 : మండలంలో కుకకాటు బాధితులు పెరిగిపోతున్నారు. ప్రతినిత్యం ఏదో ఒక చోట మనుషులు, చిన్నారులు, పశువులపై ఊరకుకలు దాడికి పాల్పడిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆదివారం ఊటూర్ మండలకేంద్రంలోని బుడగజంగం కాలనీ, శ్రీనివాసకాలనీలో ఆరుబయట ఆటలాడుకుంటున్న 3నుంచి 6 ఏండ్లలోపు చిన్నారులపై ఊర కుకలు దాడికి పాల్పడి విశ్వ అద్విత్, రవి, రాకేశ్, మధుచందనను గాయపరిచాయి.
వీధి కుకల దాడిలో గాయపడిన చిన్నారులను తల్లిదండ్రులు గడ్డమీద అప్పంపల్లి సమీపంలోని ఏరియా దవాఖానకు చికిత్స కోసం తరలించారు. మండలంలో ఊర కుకలు స్వైర విహారం చేస్తూ అడ్డు వచ్చిన ప్రజలతో పాటు పశువులపై దాడులకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుకలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చారకొండ, అక్టోబర్ 12 : మండలంలోని వివిధ గ్రామాల్లో వీధి కుక్కల స్తెరవిహారం విపరీతంగా పెరుగుతున్నది. మండలంలోని అగ్రహారం తండాకు చెందిన నేనావత్ వర్షిత్పై ఆదివారం కుక్కలు దాడి చేసి తీవ్ర గాయపర్చాయి. ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో ఇంటిఎదుట చిన్నారి, చిన్నారులతో కలిసి ఆడుకుటున్న సమయంలో కుక్కలు దాడి చేసిన్నట్లు స్థానికులు తెలిపారు.
గమనించిన వర్షిత్ తల్లిదండ్రులు వెంటనే అతనికి కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తండాల్లో కుక్కల బెదడ ఎక్కవగా ఉంద ని గ్రామసభలో పంచాయతీ కార్యదర్శికి చెప్పినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తండావాసులు వాపోతున్నారు. రాత్రి సమయంలో బయటికి వెళ్లలంటేనే కుక్కలతో భయందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నాతాధికారులు స్పందించి వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.