మహబూబ్‌నగర్, మార్చి 23 : ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పెద్ద దవాఖానగా పేరుగాంచిన మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దవాఖానలోని రోగులపై దాడి చేశాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా కేంద్రంలోని రామయ్యబౌళికి చెందిన నిరుపేద కు టుంబమైన ఇమ్రాన్, ఫార్శ జేబిన్ ఆరేం డ్ల ఫైజాకు తీవ్ర జ్వరంతో 108 అంబులెన్స్‌లో దవాఖానకు వచ్చారు.
మాతాశిశు సంరక్షణ కేంద్రం దవాఖాన భవనం ముందు నుంచి లోపలికి వెళ్తున్న క్రమంలో అక్క డే ఉన్న ఓ పిచ్చికుక్క ఆరేండ్ల పాపను కరిచింది. అది చూసిన తండ్రి కా పాడేందుకు యత్నించగా.. అతడిని గాయపర్చింది. అక్కడే ఉన్న చి న్నారి తల్లి తరిమేందుకు ప్రయత్నించ గా.. ఆమెను కూడా కరిచాయి. అలాగే ఆరుబటయ నిద్రపోతున్న తిర్మలాపూర్ వెంకటయ్య, నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎక్లాస్పూర్కు చెందిన వృద్ధుడు రాయప్పతోపాటు మరో వ్యక్తిని కూడా పిచ్చి కుక్క కాటేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారు చికిత్స చే యించుకున్నారు.
దవాఖాన ఆవరణ లో కుక్కలు తిరుగుతున్నా అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని రోగు లు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులైనా స్పందించి జిల్లా ద వాఖానలో కుక్కలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.