మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 25 : జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో గురువారం రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల ఫుట్‌బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ హాజరై పోటీలను ప్రారంభించారు.
మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, గద్వాల, వనపర్తి, మెదక్, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం జిల్లాలనుంచి 12 జట్లుగా 240 మంది తలబడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాలకు పూర్వవైభవం తీసుకొస్తామని, పాలమూరు క్రీడా మైదానానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
పాలమూరు శుభారంభం..
ఫుట్‌బాల్ పురుషుల విభాగంలో తొలిరోజు మహబూబ్‌నగర్ జట్టు – ఖమ్మంపై 02 – 00 తో శుభారంభం చేయగా.. వనపర్తి – నిజామాబాద్ జట్లు 01 – 01 స్కోర్‌తో నిలిచాయి. ఆదిలాబాద్ – నిజామాబాద్‌పై 02 – 00 తేడాతో, కరీంనగర్ – ఖ మ్మంపై 04 – 01 తేడాతో, రం గారెడ్డి – నల్లగొండపై 06 – 00 తేడాతో, మెదక్ – వరంగల్‌పై 07 – 00 తేడాతో గెలుపొందాయి. కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి ఫల్గుణ, జిల్లా అధ్యక్షుడు భానుకిరణ్, నాగేశ్వర్, రమేశ్, శేఖర్ పాల్గొన్నారు.