మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 10 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడి యంలో నిర్వహిస్తున్న 68వ ఎస్జీఎఫ్ అం డర్-19 బాస్కెట్‌బాల్ టోర్నీ మూడురోజులుగా హోరాహోరీగా కొనసాగుతూ ఆదివారం ముగిశాయి. బాల, బాలికల రెండు విభాగంలో హైదరాబాద్ జట్టు సత్తా చాటి విజేతగా నిలిచాయి. బాలికల విభాగంలో రన్నర్స్‌గా మహబూబ్‌నగర్, బా లుర విభాగంలో రంగారెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచా యి. మూడో స్థానాన్ని రంగారెడ్డి, వరంగల్ దక్కించుకున్నాయి.
హైదరాబాద్-మహబూబ్‌నగర్ బాలికల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. చివర వరకు కొనసాగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టుపై 50- 23 పాయింట్స్ తేడాతో హైదరాబాద్ జట్టు విజ యం సాధించింది. బాలుర విభాగంలో రం గారెడ్డి జట్టుపై 56-28 తేడాతో హైదరాబాద్ జట్టు గెలుపొందింది.
ఎస్జీఎఫ్ అండర్-19 బాస్కెట్‌బాల్ పోటీలో విజయం సాధించిన జట్లు జాతీయస్థాయిలో రాణించాలని ఎస్జీఎఫ్ సెక్రటరీ పాపిరెడ్డి, టోర్నీ రాష్ట్ర పరిశీలకుడు గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బాస్కెట్‌బాల్ సంఘం నాయకులు ఖాలీద్అలీ, సుబాన్‌జీ, ఫారూఖ్, ఫిజికల్ డైరెక్టర్ ముకరం, అరుణజ్యోతి, కోచ్ ఎండీ ఖలీల్ పాల్గొన్నారు.