గద్వాల, ఆగస్టు 6 : వ్యవసాయం తరువా త ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధిగా మా రిన వృత్తి చేనేత. కర్ని, సాలే, దూదేకుల, రజ క, మైనార్టీ కులాల్లో మెజార్టీగా చేనేత వృత్తిని ఆసరా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. గ ద్వాల.. జరీ చీరలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా కాక విదేశాల్లో సైతం గద్వాల చీరలకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. గద్వాల డివిజన్ లో గద్వాల, అనంతపురం, కుర్వపల్లి, కాకులారం, ధరూర్, గట్టు, మాచర్ల, అరగిద్ద, గొర్లఖాన్‌దొడ్డి, మల్దకల్, బూడిదపాడు, నాగర్దొ డ్డి, అలంపూర్, రాజోళి, ఎక్లాస్పురం, అయి జ ప్రాంతాల్లో దాదాపు 6 948 పైగా కుటుంబాలు చేనేత వృత్తిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ను ఉపాధిని పొందుతున్నాయి.
గత ప్రభు త్వం చేనేత కార్మికులకు చేయూత నివ్వడంతో కార్మికులు తమ పూర్వవృత్తి వైపు మళ్లీ చీరలు నేస్తూ ఉపాధి పొందుతున్నారు. గద్వాల చేనే త కార్మికులకు సాంకేతికతను ఉపయోగించి విభిన్నమైన డిజనైన్లను, వినూత్న రకాల డిజైనింగ్ విభాగంలో జోగుళాంబ గద్వాల జిల్లా కు చెందిన ఇద్దరు చేనేత కార్మికులు కొండా ల క్ష్మణ్ బాపూజీ అవార్డులకు ఎంపిక కావడం చూస్తుంటే ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యం ఎలాంటిదో తెలిసిపోతుంది. ఒక నాడు సడుగులు విరిగిన సాలేల మగ్గం గత బీఆర్ఎస్ ప్ర భుత్వ చేయూతతో పూర్వవైభవం సంతరించుకున్నది. అందుకు కారణం గత ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం చేనేత బీమా, త్రిఫ్ట్ తదితర పథకాలు ప్రవేశపెట్టడంతో వారు ఉపాధి పొందడంతోపాటు కనుమరుగువుతున్న చేనే త వృత్తిని కాపాడుతున్నారు.
గద్వాలకు చీరలకు దాదాపు 300 ఏండ్లు దాటాయని చరిత్ర చెబుతున్నది. గద్వాల జరీ చీరల స్థానం సుస్థిరం. జరీ చీరల ప్రస్థానం ఈ నాటిదికాదు. సంస్థానాధీశుల కాలంలోనే గద్వాల చేనేతకు ప్రత్యేకత ఉన్నది. నాటి రాజు ల ప్రోత్సాహంతో ప్రపంచ ఖ్యాతిని దక్కించుకున్నది. అగ్గిపెట్టెలో పట్టుచీర మలిచిన అద్భు త కళానైపుణ్యం మన నేతన్న సొంతం. నేతన్నలు నేచిన చీరలకు ఎల్లలు దాటిన ప్రాశ స్త్యం. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకులు నే తన్నలను పట్టించుకోకపోవడంతోపాటు ప్రస్తు త యాంత్రిక ప్రపంచంలో హస్తకళలకు ప్రో త్సాహం కరువు కావడంతో నేతన్నలు ఇతర పనులపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నేతన్నకు మంచి రోజులు వచ్చాయి.
చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో అందించే కొండా లక్ష్మణ్‌బాపూజీ రాష్ట్ర స్థాయి పురస్కారాలకు జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ఇద్దరు కార్మికులను ఎంపిక చేశారు. గద్వాలలోని వేదనగర్కు చెందిన బావండ్ల జాకెట్ వెంకటేశ్, గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డికి చెందిన మునెప్ప ఎంపికయ్యారు. చేనేత దినత్సోవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న వేడుకల్లో వీరికి ప్రభుత్వం తరఫున పురస్కారాన్ని అందించనున్నారు.
నేను నేసిన చీ రకు రాష్ట్రస్థాయి పురస్కారం రా వడం చాలా సం తోషంగా ఉంది. 30 ఏండ్ల నుంచి చేనేత వృత్తిపై ఆ ధారపడి జీవనం సాగిస్తున్నాం. పు రస్కారం అందుకోవడం గర్వంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త ర్వాత చేనేత కార్మికులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. చంద్రునికో నూ లు పోగు అనే కాన్సెప్ట్‌ను అనుసరించి ప్రత్యేకమైనా డిజైన్‌తో చీర నేశాను. మహిళలు నూలు పోగులు చందమామకు సమర్పిస్తున్న డిజైన్‌తో చీర కొంగును రూపొందించాను. చందమామను కొలుస్తూ మరాఠీలో రాసిన కీర్తనలు పొంది చీరను నేశాను.
– వెంకటేశ్, రాష్ట్ర స్థాయి పురస్కార గ్రహీత, వేదనగర్, గద్వాల