మహబూబ్‌నగర్ కలెక్టరే ట్, సెప్టెంబర్ 27 : యువ టూరిజం క్లబ్‌ల ద్వారా పర్యాటకం, సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వ సంపదపై జిల్లాలోని విద్యార్థులకు అవగాహన కల్పించిన నేపథ్యం లో కలెక్టర్ విజయేందిరబోయికి రాష్ట్రస్థాయి అవార్డు వ రించింది.
శుక్రవారం హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిట ల్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చే తుల మీదుగా అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో టూరిజం జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, యువ టూరిజం క్లబ్ నోడల్ అధికారి, డీఈవో రవీందర్ పాల్గొన్నారు.