మహబూబ్‌నగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ విజన్‌లో రాష్ట్రం అన్ని రంగా ల్లో పురోగమిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలో శాశ్వతం గా కరువును తరిమికొట్టామని స్పష్టం చేశారు. గురువారం వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘణపురం, గోపాల్పే ట, పెద్దమందడి మండలాల్లో మంత్రి పర్యటించారు. బుద్ధారం చెరువు, ఘణపురం గణప సముద్రాన్ని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత వనపర్తి జిల్లా సమస్యలపై సీఎం కేసీఆర్‌తో చర్చించి చాలా వాటికి శాశ్వత పరిష్కార మార్గాలను వెతికామని తెలిపారు. ఎంజీకేఎల్ఐ పూర్తి చేసి కృ ష్ణా నీరు వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఎంజీకేఎల్ఐ కాల్వ తీస్తే తక్కువ ఖర్చుతో వనపర్తి నియోజకవర్గానికి సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రికి విన్నవించగా.. ఆయన సూచనల మేరకు ఘణపురం వరకు కాల్వ నిర్మించామని వివరించారు. 16 నెలల్లోనే కాల్వ నిర్మాణం చేపట్టి కృష్ణా జలాలను పారించామన్నారు. అక్కడి నుంచి కర్ణెతండాకు లిఫ్ట్‌కు నీరందించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. రూ.92 కోట్లతో ఘణపురం గణపసముద్రం, బుద్ధారం చెరువులను రిజర్వాయర్లుగా మార్చేందుకు నిధులు కేటాయించామన్నారు. త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు.
ఉమ్మడి జిల్లాలోనే తొలి చెరువు గణపసముద్రం..
ఉమ్మడి జిల్లాలోని మొదటి చెరువు గణప సముద్రమని, శాసనాల్లో లిఖించబడి ఉన్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాకతీయుల సామ్రాజ్యంలో ఇక్కడి సామంతరాజైన గణపతి దేవుడు తవ్వించిన చెరువు.. అందుకే గణప సముద్రంగా పేరొచ్చిందన్నారు. అదే పే రుపై గ్రామం ఖిల్లాఘణపురంగా పిలువబడుతుందని చెప్పారు. ఎంజీకేఎల్ఐ నీటిని తీసుకొచ్చి ఈ చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిం చి గణపసముద్రాన్ని రిజర్వాయర్‌గా మార్చేందుకు రూ.45 కోట్లు విడుదల చేశారని తెలిపారు. రిజర్వాయర్‌గా మారితే చుట్టుపక్క గ్రామాలకు సాగునీరు పుష్క లంగా అందుతుదన్నారు. బుద్ధారం రిజర్వాయర్‌కు రూ.47 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. మంత్రి వెంట అధికారులు, నాయకులు ఉన్నారు.