అలంపూర్ చౌరస్తా, ఆగస్టు 8 : మొన్నటి దాకా వర్షాలు కురవడం లేదని ప్రజలు ఆలయాల్లో నీటితో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయగా.. వరుణుడు కరుణించాడు.. గురువారం రాత్రి అలంపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్, ఇటిక్యాల, అయిజ, వడ్డేపల్లిలో వాన దంచికొట్టింది. మండలంలో 22.9 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అలంపూర్ మం డలంలోని దాదాపు 400 ఎకరాలకుపై గా పొలాల్లో వర్షపు నీరు చేరింది. ఎండుముఖం పట్టిన పంటలకు ఈ వర్షం ప్రాణం పోసిందని పలువురు రైతులు సంతోషపడుతున్నారు. కానీ కొన్ని లోతైన ప్రాంతంలో ఉన్న పొలాల్లో నీరు పెద్ద మొత్తంలో నిలిచిపోయాయి. పలు చోట్ల పత్తి, మిరప, కంది, వరి పొలాల్లో పెద్ద ఎత్తున నీళ్లు చేరాయి. దీంతో పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.