పాలమూరు కాంగ్రెస్‌లో ప్రకంపనలు!
ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక నారాయణపేట జిల్లాకు చెందిన ఓ నాయకుడి హస్తం ఉండడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన మెడకు చుట్టుకున్న లైంగిక వేధింపుల కేసు ఏకంగా ఏఐసీసీ ఇన్చార్జి రాజ్యసభ సీటుకే ఎసరు పెట్టింది.
- ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో అంటుకున్న మరక
- ఏఐసీసీ దూత మెడకు చుట్టుకున్న ‘కంభం’ క్రిమినల్ కేసు
- నారాయణపేటలో షాడో ఎమ్మెల్యేగా అంతా తానై..
- ముఖ్య నేత డైరెక్షన్లోనే అంతా..
- ఇద్దరు జిల్లా మంత్రులు సైలెంట్
- సీఎంకు వ్యతిరేకంగా ఇక్కడి ఎమ్మెల్యేలు
- కుట్ర వెనుక అసలుదారులు ఎవరో..? ఏఐసీసీకి నివేదిక..
- రంగంలో దిగిన రాహుల్ దూతలు
మహబూబ్‌నగర్, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక నారాయణపేట జిల్లాకు చెందిన ఓ నాయకుడి హస్తం ఉండడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన మెడకు చుట్టుకున్న లైంగిక వేధింపుల కేసు ఏకంగా ఏఐసీసీ ఇన్చార్జి రాజ్యసభ సీటుకే ఎసరు పెట్టింది. ముఖ్యనేత అండ దండలతోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు తెరవెనుక కుట్ర చేసినట్లు జిల్లా నేతలు ఏఐసీసీకి నివేదిక పంపించారు. కేసు నోటీసు బయటకు రావడం వెనుక ఎవరెవరి హస్తం ఉందో పూర్తి వివరాలతో ఈ నివేదికలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి జిల్లాలో కొందరు రాహుల్ దూతలు తెరవెనుక కుట్రలు ఛేదిం చే పనిలో ఉన్నారు.
నారాయణపేట జిల్లాలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అన్నీ తానై నడిపిస్తున్న సదరు నాయకుడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇన్చార్జికి ఎసరు పెట్టడం సంచలనం కలిగిస్తుంది. ఈ వ్యవహారంపై ఏఐసీసీ సీరియస్‌గా ఉంది. మరోవైపు ఉమ్మడి జిల్లాకు మరక అంటినా ఇద్దరు మంత్రులు సైలెంట్‌గా ఉండడం కూడా పార్టీలో చర్చనీయాంశం గా మారింది. ఢిల్లీ నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ముఖ్య నేతకు ఉమ్మడి జిల్లాకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా నిలబడుతున్నట్లు పార్టీలో ప్రచా రం జరుగుతోంది. చివరకు ఇది ఎక్కడికి దారితీస్తుందోనని పార్టీ నాయకులు ఆందోళనలో ఉన్నారు. ఈ వ్యవహారంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
అసలు ఏం జరిగింది..?
నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కంభం శివకుమార్‌రెడ్డి అదే పార్టీకి చెందిన బండారు శ్రీలతపై లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలోనే ఆయన పదవి కూడా పోయిన విష యం తెలిసిందే. చివరకు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైన సమయంలో 2023 ఎన్నికల్లో తన మేనకోడలు పర్ణికారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించి సైడ్ అ య్యారు. చివరకు మేనకోడలు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తాను షాడో ఎమ్మెల్యేగా రంగంలోకి దిగారు.
ఈ వ్యవహారంలో కేసు పెట్టిన కాంగ్రెస్ నాయకురాలు రాష్ర్టానికి ఇన్‌చార్జీగా వచ్చిన మీనాక్షి నటరాజన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ముఖ్య నేత అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా చూశారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన ఆమె ఏకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖ లు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన లైంగిక వేధింపుల కేసును ఉటంకిస్తూ పిటిషన్ వేయడంతో న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. అయితే ఇదంతా 2025 సంవత్సరంలో జరగడంతో ఈ వ్యవహారం పెద్దగా బయటకి రాలేదు. చివరకు ఇదే కోర్టు నోటీసు ఏఐసీసీ దూత మెడకు చుట్టుకున్నది. ఏకంగా ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేగింది.
ఇదంతా కుట్ర పూరితంగానే..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్య నేతతో పాటు మంత్రులు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు నివేదికలు వెళ్తున్నాయి. డీసీసీ అధ్యక్షుల ఎంపికతోపాటు పార్టీని ఇరకాటంలో పెట్టే నేతల వ్యవహారం ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరవేస్తున్నారు. ఈ లో పు ఎన్నికల సమయంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తామని నమ్మించి ఇవ్వకపోవడంతో అది అధిష్టానం దృష్టికి వెళ్లింది. చివరకు జా తీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రంగంలో దిగడం తో వాకిటి శ్రీహరికి ఎట్టకేలకు మంత్రి పదవి దక్కిం ది.
మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్ష పదవి విషయం లో కూడా బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదనకు కూ డా హైకమాండ్ పచ్చ జెండా ఊపింది. ఇదంతా ఏఐసీసీ దూత దగ్గరుండి పాలమూరు ఉమ్మడి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండడంతో అడ్డుకట్ట వేసేందుకు పెద్ద కుట్రలు నడిచినట్లు తెలుస్తోంది. అదును చూసిన ముఖ్యనేత అనుచరులు కంభం శివకుమార్‌రెడ్డి వ్యవహారంలో ఇచ్చిన నోటీసులు కావాలని బీజే పీ నాయకత్వానికి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీని వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేసే పనిలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఏఐసీసీ నేత ఒకరు తెర వెనుక ప్రయత్నాలు సంచలనం కలిగిస్తోంది.
మంత్రులంతా సైలెంట్..
ఏకంగా ఏఐసీసీ నేత రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన దానికి కారణం ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ నాయకుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా ఇద్ద రు మంత్రులు సైలెంట్‌గా ఉండడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నారాయణపేట జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరి కూడా ఈ వ్యవహారంపై స్పందించకపోవడంపై పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. మరో సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కామెంట్ చేయకపోవడంపై కార్యకర్తలు విస్తుపోతున్నారు. ఈ వ్యవహారం బయటపడి మూడు రోజులు గడుస్తున్నా ఉమ్మడి జిల్లా ఇద్దరు మంత్రులు సైలెంట్‌గా ఉండడంతో పార్టీలో ఏదో జరుగుతుందని అనుకుంటున్నారు. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఏఐసీసీ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచా రం. ఉమ్మడి జిల్లాకు చెందిన నేత వ్యవహారం మెడకు చుట్టుకున్నా ఎమ్మెల్యేలు సైలెంట్ కావడం వెనుక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు.
రంగంలోకి రాహుల్ దూతలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొందరు రాహుల్ దూతలు జిల్లాలో జరుగుతున్న పరిస్థితి ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో అందిస్తున్నారు. నామినేషన్ తిరస్కరణ కోర్టు నోటీసు బయటకు రావడం వెనక జరిగిన మొత్తం తతంగాన్నీ ఇప్పటికే ప్రాథమిక నివేదిక రూపంలో ఇచ్చినట్లు పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. మరోవైపు కుట్రల వెనుక ముఖ్యనేతతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల హస్తం కూడా ఉండి ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే రాహుల్ కు సన్నిహితంగా ఉన్న జిల్లా నేత ఒకరు నారాయణపేట మ హబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో ఈ వ్యవహారంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
పార్టీకి నష్టం జరిగే చర్యలపై అధిష్టానం ఆగ్రహంతో ఉందని అందు కే ఈ సంక్లిష్ట సమయంలో పార్టీకి అండగా ఉండాలని రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ముఖ్య నేత మెడకు రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశం చుట్టుకుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం వైపే ఉన్నట్లు సదరు ముఖ్య నేత అంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో కీలకంగా మారిన కంభం శివకుమార్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. నియోజకవర్గం లో మైనింగ్ ఇసుక మాఫియా, నల్లమట్టి దందాలో సాక్ష్యాధారాలతో సహా అధిష్టానానికి ఫిర్యాదులు వెలువలా వెళ్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చని ఓ ముఖ్య నేత అంటున్నారు.
పేట కలెక్టర్ ఆకస్మిక బదిలీ వెనుక..
నారాయణపేట జిల్లాలో గత మూడు నెలల కిందట ఐఏఎస్ బదిలీల్లో భాగంగా కొత్త కలెక్టర్లు నియమించారు. ఈ కలెక్టర్ వచ్చి రాగానే జిల్లా వ్యాప్తంగా ఇసుక మైనింగ్, నల్లమట్టి వ్యవహారంపై కఠినంగా వ్యవహరించారు. ఈ కలెక్టర్ ఉంటే తమ దందాలు సాగవని వెంటనే ముఖ్యనేతను శరణు వేడారు. ఏమై ందో ఏమో కానీ నెలలోపే కలెక్టర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వేరే కలెక్టర్‌ను నియమించారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ నేతల దందాలు సజావుగా సాగుతున్నాయి. కలెక్టర్‌ను బదిలీ చేయడంలో ముఖ్యనేత సహకారం అందించారు. దీనికి నజరానగా ఏఐసీసీ ఇన్చార్జి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు ఈ జిల్లా నేతల సహకారం అందించారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నారు. ముఖ్య నేత వర్సెస్ రాహుల్ సన్నిహితుడు.. ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాల్సిందే.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

