సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతున్నది. ఏం డ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రోజుకో విధంగా వినూత్న రీతిలో నిరసనలు చేపడుతున్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని దీక్షా శిబిరం నుంచి మహిళా ఉద్యోగులు బోనాలతో బైలెల్లి ఎల్లమ్మ ఆలయానికి చేరుకొని తల్లికి నైవేద్యం సమర్పించారు.
ఉద్యోగుల ఆందోళనకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మద్దతు తెలిపారు. అలాగే నాగర్‌కర్నూల్‌లో ఉద్యోగులు కండ్లకు నల్లగుడ్డలు కట్టుకోగా.. వనపర్తిలో వినూత్న వేషధారణతో సమ్మెలో పాల్గొన్నారు. గద్వాలలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, డిసెంబర్ 17