శ్రీశైలం, ఆగస్టు 30 : శ్రీశైల జలాశయం నుంచి శనివా రం ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా 10 అడుగుల మేర ఎత్తి 1, 59,912 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల గేట్లద్వారా 1,70,064 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32,567, సుంకేసుల నుంచి 56,927 క్యూసెక్కుల నీళ్లు విడుదలై సాయంత్రానికి 2,52,567 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరింది. కుడి, ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 65,240 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జలాశయం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కా గా, ప్రస్తుతం 198.36 టీఎంసీలు ఉన్నాయి.
గద్వాల, అగస్టు 30 : వరద ఉధృతి పెరగడంతో జూరాల ప్రాజెక్టు 28గేట్లు ఎత్తి 2,04,217 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.929 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎగువ నుంచి 2,10,000 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జూరాల ప్రధాన ఎడమ కాల్వకు 390, కుడికాల్వకు 400, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, విద్యుత్ ఉత్పత్తికి 32,567క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
అయిజ, ఆగస్టు 30 : తుంగభద్ర డ్యాంకు వరద చేరుతోంది. 14 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 54,653 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. శనివారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 51,277 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 69,705 క్యూసెక్కులుగా ఉన్నది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 78.21 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 68,805, ప్రధాన కాల్వకు 624 క్యూ సెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు 68,18 క్యూసెక్కుల నీరు చేరుతోంది.
రాజోళి, ఆగస్టు 30 : సుంకేసుల డ్యాం నుంచి వరద కొనసాగుతున్నది. శనివారం టీబీ డ్యాం నుంచి 59వేల క్యూసెక్కుల నీరు సుంకేసుల డ్యాంకు చేరుతుండడంతో 13గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి శ్రీశైలం డ్యాంకు 56,485 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఏఈ మహేంద్రరెడ్డి తెలిపారు.