మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 25 : తెలంగా ణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని.. అటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని.. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు పాలమూరు నుంచి జనం దండులా కదిలిరావాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌లో గల బీఆర్ఎస్ కార్యాలయంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి మాజీ మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు ల క్ష్మారెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగరవేసి పండుగ వాతావరణంలో సంబురాలు నిర్వహించాలన్నారు. అనంతరం వరంగల్ సభకు జాతరలా తరలిరావాలని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థలు నిర్వహించేందుకు సర్కారు వెనుకడుగు వేస్తున్నదని, అవసరమైతే కోర్టును ఆశ్రయించి ఎన్నికలు నిర్వహించేలా చూస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కరోనా కష్టకాలంలో కూడా రైతుల నుంచి ధాన్యం సేకరించి డబ్బులు అందించామని, కానీ ప్రస్తుత సర్కారు కనీసం గన్నీ బ్యాగులు కూడా ఇవ్వకుండా రైతులను అష్టకష్టాలకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే సాగునీళ్లు లేక, పర్యావరణ పరిస్థితుల కారణంగా సర్వం కోల్పోయి కొద్దో గొప్పో మిగిలిన ధాన్యానికి ఫలితం దక్కకుండా సర్కారు నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు.
గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లా నుంచి తండోపతండాలుగా తరలివచ్చేందుకు జనం సిద్ధమవుతున్నారని, గ్రామాల్లోకి వెళితే వచ్చే స్పందనను చూస్తే ఇట్టే అర్థమవుతున్నదన్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ అసమర్థతను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అత్యధికంగా ఎమ్మెల్యేలు గెలిచినా, సీఎం పాలమూరు జిల్లావాసి అ యినా కూడా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల కృషి, ప్రజలు మాపై పెట్టుకున్న అభిమానంతో ఎమ్మెల్సీగా నవీన్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకున్నామని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలన్నారు. రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని కోరారు.
రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి తిరిగి గులాబీ జోష్ పెంచాలని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని, రానున్న కాలంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి పిరికిపంద చర్యగా మాజీ మం త్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎ మ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇ లాంటి ఘటన ఎంతో దురదృష్టకరమని, ఉగ్రదాడి లో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ న ర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రహెమా న్, మాజీ జెడ్పీటీసీలు వెంకటేశ్వరమ్మ, నరేందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, గణేశ్, దేవేందర్‌రెడ్డి, కరుణాకర్‌గౌడ్, ఆంజనేయులు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మక్తల్, ఏప్రిల్ 25 : ఈనెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మక్తల్ మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రజతోత్సవ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను అతికించి విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కొట్లాడి సాధించిన రాష్ర్టాన్ని కేసీఆర్ పదేండ్లలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిన్న హన్మంతు, గాల్‌రెడ్డి, శంకర్, మారుతి గౌడ్, అన్వర్ హుస్సేన్, మన్నన్, అమ్రేశ్, సత్య ఆంజనేయులు, ఆనంద్, సాధిక్, ఆంజనేయులు పాల్గొన్నారు.