మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జనవరి 22 : మంత్రివర్గంలో లబాండీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఇవ్వాలని మాజీ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండ పం వద్ద బుధవారం ధర్నాచౌక్‌లో గిరిజన విద్యార్థిసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహారదీక్షలో మాజీ మంత్రి పాల్గొని బీఆర్ఎస్ తరఫున మద్దతు ప్రకటించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్‌శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవిద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, బాలబాలికల కళాశాల వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గిరిజన తండాలను రెవెన్యూ గ్రామపంచాయతీలుగా గుర్తించి ఒక్కొక్క పంచాయతీ అభివృద్ధికి రూ. 5కోట్ల చొప్పున ఇవ్వాలన్నారు. గిరిజన విద్యార్థి సంఘం న్యాయపరమైన డిమాండ్లకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. క్యార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌నాయక్, ప్రతాప్‌నాయక్, సంజీవ్‌నాయక్, లక్ష్మణ్‌నాయక్, కిషన్‌పవార్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.