పాలమూరు, ఫిబ్రవరి 9 : బీఆర్ఎస్ హయాంలో మన్యంకొండ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం మన్యంకొండ బ్రహోత్సవాల పోస్టర్‌ను మాజీ మంత్రి ఆదివారం పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ హయాంలో మన్యంకొండను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. కొండపైకి వెళ్లేందుకు నాలుగు వరసల రహదారి, అతిథి గృహం, కల్యాణమండపంతోపాటు బ్రహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు గుర్తుచేశారు.
అంతకుముందు దివిటిపల్లిలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ప్రాగణంలో నూతనగా నిర్మించిన జిట్ట ఆంజనేయస్వామి విగ్రహం, నవగ్రహాలు, ధ్వజస్తంభం, పోచమ్మ, నాభిశిల బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయు లు, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మండల అ ధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్, వెంకటస్వామి, రాంలక్ష్మణ్, నవకాంత్, గణేశ్,దేవస్థాన ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, రాములు, మ ధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.