మహబూబ్‌నగర్, జూన్ 18 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మేము తుమ్మిళ్ల ప్రాజెక్టు తెచ్చి వేలాది ఎకరాలకు నీరందిస్తే, వందల ఎకరాలు మా ర్కెట్ ధరకు కొని ఎస్సీలకు ఇస్తే ఈ రోజు వారి భూములు లాక్కోని ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఈ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తే రైతులపై అక్రమంగా కేసులు పెట్టి ఈ ప్రజా ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడమే కాకుం డా అన్నం పెట్టే అన్నదాతల చేతులకు బేడీలు వేసి ఈ రోజు కోర్టుకు తీసుకురావడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతి రేకించిన రైతులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించగా బుధవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా జైలుకు వచ్చిన మాజీ మంత్రి రైతులను పరామర్శించారు. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా జైలుకు వెళ్లామని, గాంధీజీ కూడా దేశ స్వాతంత్య్రం కోసం జైలులో ఉన్నారని, మీరు అధైర్య పడొద్దని మీ భూమి కోసం పోరాటం చేశారని దేశ ద్రోహం ఏమీ చేయలేదన్నారు. మీకు మేము అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తుమ్మిళ్ల ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు నీరు అందించాం, వేరే ప్రాంతం వాళ్లు అలంపూర్, గద్వాలకు వలస వచ్చే విధంగా బీఆర్ఎస్ హయాంలో చేశాం. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న పొలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. రైతులకు బేడీలు వేసి తీసుకుపోవడం అసలు మంచిది కాదన్నారు. దొంగల లెక్కన రైతులను చూడటం బాధాకరమన్నారు. అణిచివేతలను ఎదిరించే స్వభావం తెలంగాణ ప్రజల రక్తంలో ఉందన్నారు.
కేసుల పేరుతో ఆరాచకం చేస్తే సరికాద ని, ప్రభుత్వం, అధికారుల తీరు ఇదే విధంగా ఉంటే 12 గ్రామాలకు 1,200 గ్రామాలు అండగా వచ్చి పోరాటం చేస్తాయన్నారు. డ్యూటీలో ఉన్న జైలర్‌ని కూడా కేసులో పెట్టారు. పొలాల వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటున్నా రైతులను పట్టుకొ చ్చి కేసులు పెట్టా రు, తప్పడు కేసులను నమోదు చే శారు. పంటలు ప ండించే చోట పరి శ్ర మ వద్దని, వెంటనే ర ద్దు చేయాలని, రైతుల పై పెట్టిన ఆక్రమ కేసులను వెం టనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వెంట ము న్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయ కులు నవకాంత్, పాల సతీశ్, రాజోళి మండల నాయకుడు మైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
14 రోజుల రిమాండ్ అనంతరం జిల్లా జైలు నుంచి బుధవారం సాయంత్రం 6:50 గంటలకు 12 మందిని బెయిల్ మంజూరు అయ్యింది. నిబంధనల ప్రకారం జైలు అధికారులు తనిఖీలు చేసి పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన బి. చిన్న నర్సింహులు, కే నర్సింహ, భరత్‌కుమార్, చిన్న నరేందర్, నల్లబో తులా కటాం, పరశురాముడు, శివగౌడ్, ఎన్ తిమ్మా రెడ్డి, సూర్యప్రకాశ్, భీమన్న, మనోహార్, యేసన్నను జైలు నుంచి విడుదల చేశారు.